logo

పరస్పర ఫిర్యాదులు - కేసు నమోదు

మండల పరిధిలోని సంగుపాలెంలో మంగళవారం అర్ధరాత్రి తన భర్త శ్రీనివాసరావుపై సర్పంచి శివకుమారి, ఆమె కుమారుడు కానిస్టేబుల్‌ యెనికపల్లి మహేష్‌ కత్తితో దాడి చేసి చెవి కోసేశారని యానిమేటర్‌ కుమారి ఇచ్చిన ఫిర్యాదు

Published : 30 Mar 2023 05:28 IST

దాడిలో చెవి తెగి గాయపడ్డ శ్రీనివాసరావు

సంగుపాలెం(పిట్టలవానిపాలెం), న్యూస్‌టుడే: మండల పరిధిలోని సంగుపాలెంలో మంగళవారం అర్ధరాత్రి తన భర్త శ్రీనివాసరావుపై సర్పంచి శివకుమారి, ఆమె కుమారుడు కానిస్టేబుల్‌ యెనికపల్లి మహేష్‌ కత్తితో దాడి చేసి చెవి కోసేశారని యానిమేటర్‌ కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు చందోలు ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు. ఆయన బుధవారం మాట్లాడుతూ శ్రీనివాసరావు తన ఇంటికి వచ్చి దుర్భాషలాడి, దాడికి దిగాడని సర్పంచి శివకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపైనా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మహిళలను తరలించే విషయమై ఇరువర్గాలకు గొడవ జరిగినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని