logo

Nara Lokesh: పేదరికం లేని మంగళగిరి నా కల: లోకేశ్‌

‘పేదరికం లేని మంగళగిరి నా కల. గెలిచాక పేదలకు 20 వేల ఇళ్లు, ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి పూర్తి హక్కులతో పట్టాలు అందజేస్తా’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి తెదేపా అభ్యర్థి నారా లోకేశ్‌ భరోసా ఇచ్చారు.

Updated : 16 Mar 2024 08:56 IST

లోకేశ్‌ సమక్షంలో తెదేపాలో చేరిన కుటుంబాలు

తాడేపల్లి, న్యూస్‌టుడే: ‘పేదరికం లేని మంగళగిరి నా కల. గెలిచాక పేదలకు 20 వేల ఇళ్లు, ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి పూర్తి హక్కులతో పట్టాలు అందజేస్తా’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి తెదేపా అభ్యర్థి నారా లోకేశ్‌ భరోసా ఇచ్చారు. పట్టణంలోని 16, 19, 20 వార్డులకు చెందిన 75 కుటుంబాలు, మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన 25 కుటుంబాలు, పట్టణానికి చెందిన కొదమల సైమన్‌, జొన్నాదుల శివశంకర్‌, సాయిప్రసాద్‌, బాలసూర్యకుమార్‌, వాకా మాధవరావు ఆధ్వర్యంలో 70 కుటుంబాలు, బట్టు శివానందశాస్త్ర, చెల్లూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో దామర్ల శివశంకర్‌, వీరాస్వామితోపాటు 25 కుటుంబాలు ఆత్మకూరు నుంచి పులివర్తి సుందరయ్య ఆధ్వర్యంలో వేమూరి మోహన్‌, ఖమ్మంపాటి చందు, ప్రేమ్‌కుమార్‌, వేమూరి ప్రభుదాసుతోపాటు 30 కుటుంబాలు లోకేశ్‌ సమక్షంలో శుక్రవారం తెదేపాలో చేరాయి. ఉండవల్లిలోని ఆయన నివాసంలో నిర్వహించిన ఈ క్రమంలో పార్టీలో చేరిన వారికి లోకేశ్‌ పసుపు కండువాలు కప్పి ఆహ్వానించారు.

తాగునీళ్లు ఇవ్వలేని స్థితిలో పాలకులు..: లోకేశ్‌ మాట్లాడుతూ ఓడినా ప్రజల్లోనే ఉండి సొంత నిధులు వెచ్చించి సేవ చేస్తున్నానని అన్నారు. ఇక్కడ ప్రజలు వరుసగా రెండుసార్లు అవకాశం ఇచ్చినా కనీసం మంచినీళ్లు ఇవ్వలేని స్థితిలో స్థానిక ఎమ్మెల్యే ఆర్కే ఉన్నారని విమర్శించారు. తాను చిరు వ్యాపారులకు నాలుగేళ్లుగా తోపుడు బండ్లు ఇస్తున్నానన్నారు. ‘జËయహో బీసీ’ సభలో యూ-1 రిజర్వు జోన్‌ ఎత్తివేస్తానని చంద్రబాబు హామీ ఇవ్వగానే ఇప్పుడు యూ-1 జోన్‌ ఎత్తివేశారన్నారు. మంగళగిరిని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దే మాస్టర్‌ ప్లాన్‌ తన వద్ద ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో అవకాశం ఇస్తే ఈ ప్రాంతం రుణం తీర్చుకుంటానన్నారు. నీలం బటన్‌ నొక్కి రూ.10 ఖాతాలో వేస్తూ ఎర్ర బటన్‌తో రూ.100 కొట్టేయడం సీఎం జగన్‌కు వెన్నతోపెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక తొమ్మిదిసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని