logo

నియమావళి అమలు ఇలాగేనా?

ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 12 రోజులు గడిచింది. అమలుకు సంబంధించి ప్రత్యేకాధికారులను నియమించినా కొన్నిచోట్ల కోడ్‌ ఉల్లంఘనలు కనపడుతూనే ఉన్నాయి.

Published : 29 Mar 2024 04:03 IST

వేటపాలెం, అద్దంకి, మేదరమెట్ల, న్యూస్‌టుడే: ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 12 రోజులు గడిచింది. అమలుకు సంబంధించి ప్రత్యేకాధికారులను నియమించినా కొన్నిచోట్ల కోడ్‌ ఉల్లంఘనలు కనపడుతూనే ఉన్నాయి. జగనే మా భవిష్యత్తు అనే కార్యక్రమం కింద ప్రతి క్లస్టర్‌ పరిధిలో అధికార పార్టీ జెండా దిమ్మెలు ఏర్పాటుచేసి, వాటికి పార్టీ రంగులు వేసి మరీ ఆవిష్కరించారు. వీటిల్లో చాలా వాటికి కోడ్‌ వచ్చిన తరువాత తెల్లరంగు వేశారు. అయినా కొన్నిచోట్ల అవి కనపడుతూనే ఉన్నాయి. అద్దంకిలో అధికార పార్టీ జెండాలు ఎగురవేసిన సిమెంటు దిమ్మెలు, ఇనుప చువ్వలు పార్టీ రంగుతోనే ఉన్నాయి.

మంచినీటి శుద్ధజల కేంద్రం వద్ద రాజకీయ నేతల ఫొటోలు రహదారిపైకి కనిపిస్తున్నాయి. వేలమూరిపాడు జగనన్న కాలనీ శంకుస్థాపన శిలాఫలకంపై రాజకీయ నాయకుల చిత్రపటాలు తొలగించకపోవటంపై స్థానికులు విమర్శిస్తున్నారు.  కొరిశపాడు మండలం తమ్మవరంలో గ్రామ సచివాలయం ఎదురు ఉన్న వైకాపా, తెదేపా జెండా దిమ్మెలకు ఉన్న రంగు తొలగించలేదు. అనమనమూరులో ఉన్న విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌, రైతుభరోసా కేంద్రాల్లో స్థానిక సర్పంచి, ఈ భవనాల్లో ఉన్న శిలాఫలకాల్లో రాజకీయ నాయకుల పేర్లకు ముసుగు తొడగలేదు.  ఇప్పటికైనా వీటికి రంగు వేయడానికి అధికారులు చర్యలు చేపట్టాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని