logo

శస్త్ర చికిత్స, ఔషధాల్లేకుండానే గుండె జబ్బుల నుంచి విముక్తి

ఒంట్లో నీరసం, కనీసం పది అడుగులు నడవలేకపోవడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఇవన్నీ గుండె సంబంధిత సమస్యలు. ముఖ్యంగా ఒకసారి గుండెపోటు వచ్చి స్టంట్స్‌ వేసుకున్నవారు,

Updated : 11 Aug 2022 05:02 IST


హృద్రోగ సమస్యల నుంచి కోలుకున్న రోగులతోపాటు ఈఎస్‌ఐసీ వైద్యకళాశాల వైద్యులు, సిబ్బంది

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: ఒంట్లో నీరసం, కనీసం పది అడుగులు నడవలేకపోవడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఇవన్నీ గుండె సంబంధిత సమస్యలు. ముఖ్యంగా ఒకసారి గుండెపోటు వచ్చి స్టంట్స్‌ వేసుకున్నవారు, శస్త్ర చికిత్స చేయించుకున్నవారిలోనూ ఈ తరహా సమస్యలు తలెత్తే అవకాశముంది. ఇటువంటి వారికి శస్త్రచికిత్స అవసరం లేకుండా, ఔషధాల వినియోగాన్ని తగ్గిస్తూ సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల కార్డియాక్‌ రిహబ్‌ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోనే ప్రప్రథమంగా ఈ తరహా చికిత్సా విధానం అందుబాటులోకి తీసుకొచ్చామని వైద్య కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, కార్డియాక్‌ రిహబ్‌ కార్యక్రమ రూపకర్త డా.మురళీధర్‌ తెలిపారు. బుధవారం ఈఎస్‌ఐసీ వైద్య కళాశాలలో విలేకరులకు వివరాలు వెల్లడించారు.   ఎటువంటి ఔషధాలు, శస్త్రచికిత్సలు అవసరం లేకుండానే తక్కువ ఖర్చుతో కార్డియాక్‌ రిహబ్‌ కార్యక్రమం ద్వారా పూర్తిగా కోలుకోవచ్చన్నారు. ఈఎస్‌ఐసీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా.కల్యాణ్‌ పాల్‌, డిప్యూటి సూపరింటెండెంట్‌ డా.శైలజ, కార్డియాక్‌, కార్డియో థోరాసిక్‌ విభాగాధిపతులు డా.సదానంద్‌రెడ్డి, డా.అభిజిత్‌, డా.సుష్మ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని