logo

జీహెచ్‌ఎంసీ వర్సెస్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యనే కాదు... నగరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల మధ్య వార్‌ నడుస్తోంది. నగరంలో జీహెచ్‌ఎంసీ చేపట్టిన పైవంతెనల, నాలాల విస్తరణ, రహదారుల మరమ్మతుల సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ దెబ్బతింటోంది.

Updated : 24 Nov 2022 08:33 IST

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యనే కాదు... నగరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల మధ్య వార్‌ నడుస్తోంది. నగరంలో జీహెచ్‌ఎంసీ చేపట్టిన పైవంతెనల, నాలాల విస్తరణ, రహదారుల మరమ్మతుల సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ దెబ్బతింటోంది. ముందస్తు సమాచారం ఉన్న చోట బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ లైన్లను మారుస్తోంది. ఇందుకు అయ్యే వ్యయం చెల్లించాలని బల్దియాను కోరుతోంది. కరెంట్‌, నీటి పైపులైన్లు మార్చాల్సి వస్తే ఆయా సంస్థలకు చెల్లించినట్లే తమకూ ఇవ్వాలని లేఖల మీద లేఖలు రాస్తోంది. అయినా జీహెచ్‌ఎంసీ స్పందించడం లేదని బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు అంటున్నారు. గత వారం శ్రీనగర్‌కాలనీలో రహదారి మరమ్మతుల సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ డక్ట్‌ దెబ్బతింది. దీంతో ఆ ప్రాంతంలో 3 వేల బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులు మూడు రోజులు ఇబ్బంది పడ్డారు. అమీర్‌పేట-లింగంపల్లి మార్గంలోనూ నిర్వహణ మరమ్మతుల కోసం జీహెచ్‌ఎంసీ అనుమతి కోరినా ఇప్పటి వరకు రాలేదు. అనుమతి ఇచ్చిన చోట భారీగా ఛార్జీలు వసూలు చేస్తోందని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలంగాణ సీజీఎం కె.వి.ఎన్‌.రావు తెలిపారు. దీనిపైనే ఇరు విభాగాల మధ్య కొంతకాలంగా లేఖల యుద్ధం నడుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని