logo

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్రవాహనం.. రైతు దుర్మరణం

రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు మృతి చెందాడు. 

Updated : 02 Jun 2023 10:04 IST

కందుకూరు: ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారిలో కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధి నేదునూరు గేట్ సమీపంలో చోటుచేసుకుంది. రైతు ఉదయాన్నే పొలం వద్దకు వెళుతున్న సమయంలో లారీని ఢీకొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని నేదునూరు గ్రామానికి చెందిన యాలాల కృష్ణారెడ్డి (45)గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

మరో ప్రమాదంలో యువకుడు..

కందుకూరు పోలీస్‌స్టేషన్‌ పరిధి రాచులోర్‌ రోడ్డు భైరాగిగూడ మిర్చి ఫ్యాక్టరీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. కారు-బైక్‌ ఢీకొన్ని ఘటనలో లేమూర్‌ గ్రామానికి చెందిన పాల్వాయి రవి (35) దుర్మరణం పాలయ్యాడు. కందుకూరు నుంచి లేమూర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని