logo

దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి

దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్‌ అన్నారు.

Published : 26 Apr 2024 01:43 IST

వికారాబాద్‌ కలెక్టరేట్‌: దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ల్యాండ్‌ రెవెన్యూ కమిషనర్‌ ఆదేశాల మేరకు దేవాదాయ భూములపై రెవెన్యూ, దేవాదాయ శాఖాధికారులతో సమీక్షించారు. సర్వే నంబర్ల వారీగా భూముల వివరాలను అందించాలన్నారు. భూములు పరిరక్షణకు రెవెన్యూ, అటవీ శాఖాధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ శేఖర్‌, జిల్లా ఇన్‌స్పెక్టర్‌ మధుబాబు, అధికారులు మునీరుద్దీన్‌, గోవిందమ్మ, శివ, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


చీటీతో పాటు ఓటు సమాచార డైరీ అందజేత

కొడంగల్‌: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి గురువారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌ మాట్లాడారు. పోలింగ్‌ చీటీలతో పాటు ప్రతి కుటుంబానికి పోలింగ్‌ సమాచార డైరీని అందించడం జరుగుతుందన్నారు. దీన్లో ఓటు హక్కు నమోదు, ఓటు వేసే విధానం, ఏ ఓటరు ఎలా వినియోగించుకోవాలి వంటి పలు అంశాలను క్లుప్తంగా వివరించామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీˆల్దార్‌ బి.విజయ్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బల్‌రాంనాయక్‌, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని