logo

అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత

జిల్లాలో ఈసారి ఇంటర్‌ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది.

Published : 26 Apr 2024 01:48 IST

ద్వితీయ ఇంటర్‌ ఫలితాల తగ్గుదలకు కారణాలనేకం
న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌, పరిగి

జిల్లాలో ఈసారి ఇంటర్‌ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. గతానుభవాల దృష్ట్యా వచ్చే విద్యా సంవత్సరం మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని అధికారుల మొదలు, అధ్యాపకుల వరకు ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో ద్వితీయ సంవత్సరం తగ్గుదలకు గల కారణాలపై కథనం.

వేధిస్తున్న అధ్యాపకుల కొరత

జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు కలిపి 74 జూనియర్‌ కళాశాలలున్నాయి. ఫలితాలు తగ్గటానికి ఎన్నో రకాల కారణాలు కనిపిస్తున్నాయి. అనేక జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉదాహరణకు వికారాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 20 మంకి పైగా అధ్యాపకులుండాలి. కానీ రెగ్యులర్‌గా 6 మందే ఉన్నారు. మిగతా 16 మంది అతిథి అధ్యాపకులే కావడం గమనార్హం. వీరిని నియమించటంలో జాప్యం చేయటం విపరీతమైన ప్రభావం కనిపిస్తోంది.  ః అనేక ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు సక్రమంగా లేవు. పరికరాల్లేని ప్రయోగశాలలు, పుస్తకాల్లేని గ్రంథాలయాలు ఎక్కువే.  ః పలు కళాశాలల్లో నేటికీ చెట్లకిందే పాఠాలు జరుగుతుండటం శోచనీయం.


25వ స్థానం నుంచి 27వ స్థానానికి..

గత 2022-23లో ద్వితీయ సంవత్సరంలో 25 స్థానం, ప్రథమ సంవత్సరం 30 స్థానంలో ఉంది. బుధవారం ప్రకటించిన 2023-24 ఫలితాల్లో ద్వితీయలో 27వ స్థానానికి పడిపోతే, ప్రథమంలో మాత్రం 22 స్థానానికి ఎగబాకింది.  

  • జిల్లాలోని మొత్తం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరంలో 49 శాతం, ప్రథమ సంవత్సరం 33శాతం ఉత్తీర్ణత సాధించారు. నవాబ్‌పేట కళాశాల చివరి స్థానంలో నిలిచింది.
  • ప్రథమలో అత్యధికంగా వికారాబాద్‌ జూనియర్‌ కళాశాల సాధించింది. 205 మందికి 93 మంది (45శాతం) ఉత్తీర్ణులయ్యారు. అత్యల్పంగా మోమిన్‌పేట జూనియర్‌ కళాశాల నిలిచింది.61 మందికి 3 మంది మాత్రమే ఉత్తీర్ణత (4శాతం) సాధించారు.
  • సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 76 శాతం సాధించారు.
  • ఆదర్శ కళాశాలల్లో 40.09 శాతం ఉత్తీర్ణత సాధించారు.
  • కస్తూర్బా కళాశాలల్లో 70.47 శాతం ఫలితం వచ్చింది.

తగు చర్యలు చేపడతాం..

- శంకర్‌ నాయక్‌, నోడల్‌ అధికారి.

ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి. ద్వితీయ సంవత్సరం తగ్గడంపై చర్చిస్తున్నాం. ఈసారి మరింత ఉన్నత ఫలితాలు సాధించేందుకు తగు చర్యలు చేపడతాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని