logo

తలసరి ఆదాయమేకాదు.. కరెంట్‌ వినయోగంలోనూ టాప్‌

ఐటీ సంస్థలు.. ఏరో సెజ్‌లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు..  ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్‌ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్‌ పరిధిలో అత్యధిక కరెంట్‌ డిమాండ్‌ ఉంటోంది.

Published : 26 Apr 2024 02:05 IST

రంగారెడ్డి జోన్‌లో అత్యధిక డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీ సంస్థలు.. ఏరో సెజ్‌లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు..  ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్‌ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్‌ పరిధిలో అత్యధిక కరెంట్‌ డిమాండ్‌ ఉంటోంది. తలసరి ఆదాయంలో ముందున్న ఈ ప్రాంతం.. కరెంట్‌ వాడకంలోనూ అదే ప్రతిబింబిస్తోంది. జీహెచ్‌ఎంసీలో ఇటీవల 4వేల మెగావాట్ల కరెంట్‌ డిమాండ్‌ రాగా.. అందులో సగం రంగారెడ్డి జోన్‌ పరిధిలోనే ఉంటోంది.

  • హైదరాబాద్‌కు ఒకవైపు మేడ్చల్‌ జోన్‌ ఉంటే.. మరోవైపు రంగారెడ్డి జోన్‌ ఉంది. సరూర్‌నగర్‌, రాజేంద్రనగర్‌, సైబర్‌సిటీ, వికారాబాద్‌ విద్యుత్తు సర్కిల్స్‌ ఈ జోన్‌ పరిధిలోకి వస్తాయి. నాలుగు సర్కిల్స్‌లో కలిపి ఈనెల 5న 1979 మెగావాట్ల అత్యధిక డిమాండ్‌ నమోదైంది. గత ఏడాది గరిష్ఠ డిమాండ్‌ చూస్తే 1579 మెగావాట్లు మాత్రమే.
  • ఆర్‌ఆర్‌ జోన్‌లో రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో పరిశ్రమలు అత్యధికంగా ఉన్నాయి. సహజంగానే ఇక్కడ డిమాండ్‌ ఎక్కువ. ఈసారి అది మరింత పెరిగింది. 775 మెగావాట్ల డిమాండ్‌ ఈ సర్కిల్‌లో నమోదవుతోంది. 2023లో 614 గరిష్ఠ డిమాండ్‌ నమోదైంది.
  • ఐటీ సంస్థలకు నిలయంగా ఉన్న సైబర్‌సిటీ సర్కిల్‌లో ఈనెల 20న గరిష్ఠంగా 683 మెగావాట్ల డిమాండ్‌ వచ్చింది. ఏడాది క్రితం 455 మెగావాట్లు మాత్రమే ఉండేది.
  • సరూర్‌నగర్‌ సర్కిల్‌లో గృహ, వాణిజ్య వినియోగదారులే అధికం. ఇక్కడ 296 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌ నెలకొంది. గత ఏడాది 290 మెగావాట్లు ఉంది. స్వల్పంగా మాత్రమే డిమాండ్‌ పెరిగింది.

వినియోగం చూస్తే...

జీహెచ్‌ఎంసీ పరిధిలో  రెండురోజుల క్రితం 84.68 మిలియన్‌ యూనిట్లను ఒక్కరోజులో వినియోగించారు. ఇందులో దాదాపుగా సగం 42.03 మిలియన్‌ యూనిట్లు రంగారెడ్డి జోన్‌ పరిధిలో వినియోగిస్తున్నారు. ఇది క్రితం ఏడాదితో పోలిస్తే 20 శాతం అధికం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు