logo

ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు

వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి.

Updated : 26 Apr 2024 05:49 IST

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. స్వామివారికి సర్వసైన్యాధిపతి అయిన చక్రస్వామి ఆధ్వర్యంలో చివరిరోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఆలయంలో స్వామివారిని శ్రీదేవి, భూదేవి సమేతంగా అద్దాల పల్లకీలో ఆశీనులను చేసి ప్రత్యేకంగా అలంకరించారు. సమీపంలోని మండపంలో నవకలశ స్థాపనం, పాలికల పూజతో దేవుళ్లందరినీ ఆవాహనం చేసి సుగంధద్రవ్యాలతో నవకలశ అభిషేకం చేశారు. అనంతరం ధ్వజావరోహణం పూర్తిచేసి చక్రస్వామిని ఆలయ సమీపంలోని గండిపేట జలాశయంలో చక్రస్నానం చేయించి భక్తులందరికీ చక్రతీర్థాన్ని ఇచ్చారు. ఆలయ మేనేజింగ్‌ కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎంవీ సౌందరరాజన్‌, కన్వీనర్‌ గోపాలకృష్ణస్వామి, ఆలయ అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌, కృష్ణమాచార్యులు, రామాచార్యులు, కన్నయ్య, సురేష్‌, అనిల్‌, బాలాజీ, కిట్టు, నరసింహన్‌, గున్నాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు