icon icon icon
icon icon icon

Kishanreddy: గ్యారంటీల పేరుతో కాంగ్రెస్‌ గారడీ చేస్తోంది: కిషన్‌రెడ్డి

భారాస ఎమ్మెల్యేలు పార్టీ మారటం చూసి కేసీఆర్‌ ఫ్రస్టేషన్‌లో ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు.

Published : 20 Apr 2024 16:51 IST

హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్యేలు పార్టీ మారటం చూసి కేసీఆర్‌ ఫ్రస్టేషన్‌లో ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. భారాస ఓడిపోయి 5 నెలలు గడిచినా.. ఓటమిని కేసీఆర్‌, కేటీఆర్‌ ఇంకా అంగీకరించడం లేదన్నారు. కుమార్తె లిక్కర్‌ కేసు, ఫోన్ల ట్యాపింగ్‌ కేసుల్లో ఆ పార్టీ కూరుకుపోయిందని విమర్శించారు. గెలిచిన ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేని స్థితిలో భారాస ఉందన్నారు.

గ్యారంటీల పేరుతో కాంగ్రెస్‌ పార్టీ గారడీ చేసి ఓట్లు దండుకుందని, లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల కోసం రేవంత్‌రెడ్డి మళ్లీ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. వందరోజుల్లోనే గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడేమో ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తామంటున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల కోడ్‌ అయిపోగానే రుణమాఫీ చేయకుండా ఆగస్టు 15వరకు ఆగాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ‘‘ఎన్నికల ప్రచారంలో, అన్ని విషయాల్లో భాజపా ముందుంది. ఇప్పటికే ఐదు సభల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించాం’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img