logo

కొరియర్‌ పేరుతో వైద్యురాలికి టోకరా

కొరియర్‌లో డ్రగ్స్‌ పార్సిల్‌ వచ్చిందని సైబర్‌ నేరస్థులు బెదిరించి  వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం..

Published : 24 Apr 2024 01:51 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: కొరియర్‌లో డ్రగ్స్‌ పార్సిల్‌ వచ్చిందని సైబర్‌ నేరస్థులు బెదిరించి  వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన వైద్యురాలికి ఫెడెక్స్‌ కొరియర్‌ కార్యాలయం నుంచి ఫోన్‌ చేసి మీ పేరుతో మలేసియా నుంచి దిల్లీకి కొరియర్‌ సంస్థ ద్వారా పార్సిల్‌ వచ్చిందని, అందులో డ్రగ్స్‌ ఉన్నాయని, దిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. కొద్దిసేపట్లోనే సీబీఐ కానిస్టేబుల్‌నంటూ మరొకరు ఫోన్‌ చేశారు. వాట్సాప్‌లో ఆమె పేరుతో ఉన్న అరెస్టు వారెంట్‌ ప్రతిని పోస్టు చేశారు. దిల్లీ కోర్టులో హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. లేదంటే మరుక్షణమే హైదరాబాద్‌ పోలీసులు ఇంటికొచ్చి అరెస్టు చేస్తారని, దర్యాప్తునకు సహకరించాలని బెదిరించాడు. బాధితురాలు నేరస్థులు చెప్పినట్లు చేస్తూ పోయారు. సీబీఐ సీనియర్‌ అధికారినని సుమారు రెండు గంటల పాటు వాట్సాప్‌లో ఇంటర్వ్యూ చేశాడు. బ్యాంకు వివరాలు అడిగి తెలుసుకున్నాడు. కొంత మొత్తాన్ని సెక్యూరిటీ ఫండ్‌ కింద చెల్లించమన్నాడు. తన ఖాతాలో రూ.3 వేలు మాత్రమే ఉన్నాయని బాధితురాలు చెప్పగానే ఆ బ్యాంకు డిపాజిట్‌ వివరాలు అడిగాడు. భయపడుతూనే బాధితురాలు తన వద్ద రెండు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఒక్కొక్కటి రూ.25లక్షలు ఉంటుందని చెప్పింది. ఆ మొత్తాన్ని ఆర్‌బీఐ రహస్య ఖాతాలో డిపాజిట్‌ చేయాలన్నాడు. బాధితురాలు రూ.48 లక్షలు నేరస్థుడు చెప్పిన ఖాతాకు బదిలీ చేశారు. కొద్దిసేపట్లోనే తేరుకున్న ఆమె వెంటనే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు దాఖలు చేయడంతో పాటు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు