logo

సింగరేణి యాజమాన్యం అప్రమత్తం

సింగరేణిలో ఒకేరోజు భారీఎత్తున కేసులు పెరిగాయి. రామగుండం రీజియన్‌లో 151 కేసులు నమోదయ్యాయి. రెండు రోజులుగా సెలవులు కావడంతో కరోనా పరీక్షలు నిర్వహించలేదు. శనివారం సంక్రాంతి పండగ, ఆదివారం సెలవు కావడంతో రెండు రోజులు కొవిడ్‌ పరీక్షలను సింగరేణి ఆస్పత్రుల వద్ద నిర్వహించలేదు. ​​​​​​​

Published : 18 Jan 2022 02:04 IST

న్యూస్‌టుడే, గోదావరిఖని

సింగరేణిలో ఒకేరోజు భారీఎత్తున కేసులు పెరిగాయి. రామగుండం రీజియన్‌లో 151 కేసులు నమోదయ్యాయి. రెండు రోజులుగా సెలవులు కావడంతో కరోనా పరీక్షలు నిర్వహించలేదు. శనివారం సంక్రాంతి పండగ, ఆదివారం సెలవు కావడంతో రెండు రోజులు కొవిడ్‌ పరీక్షలను సింగరేణి ఆస్పత్రుల వద్ద నిర్వహించలేదు. సోమవారం ఒక్కరోజే 151 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. 322 మందికి పరీక్షలు నిర్వహించగా 151 మందికి పాజిటివ్‌గా నమోదయ్యాయి. అంటే 50 శాతం కేసులు నమోదయ్యాయి. రానున్న కాలంలో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉండటంతో సింగరేణి యాజమాన్యం అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఆస్పత్రుల్లో పడకలతో పాటు కిట్లు, మందులను సమకూర్చుకుంటోంది. ప్రస్తుతం మూడో దశ మార్గదర్శకాల ప్రకారం నివారణ చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం సింగరేణివ్యాప్తంగా అన్ని ప్రాంతాల జీఎంలతో పాటు ఆస్పత్రి సూపరింటెండెంట్లు, పర్సనల్‌ విభాగాల అధికారులతో దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించింది. ఇందులో ప్రాంతాల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. మార్గదర్శకాలు పాటించాలని వెల్లడించారు.

913 యాక్టివ్‌ కేసులు

సింగరేణిలో ప్రస్తుతం 913 యాక్టివ్‌ కేసులున్నాయి. సింగరేణివ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మొత్తం 913 యాక్టివ్‌ కేసుల్లో 382 మంది ఉద్యోగులు, 415 మంది వారి కుటుంబ సభ్యులు, 116 మంది పొరుగు సేవల సిబ్బంది క్వారంటైన్‌లో ఉన్నారు. ఇప్పటికే సింగరేణివ్యాప్తంగా ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు, పొరుగు సేవల సిబ్బందికి 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేయడంతో ప్రభావం గత ఏడాదితో పోల్చితే తగ్గింది. అయినా కరోనా విస్తరించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై యాజమాన్యం అప్రమత్తమైంది.

వారం రోజులే క్వారంటైన్‌

కరోనా వచ్చిన ఉద్యోగులకు వారం రోజుల వరకు క్వారంటైన్‌ సమయం కేటాయించింది. గతంలో 14 రోజులు సెలవులు మంజూరు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 7 రోజులు మాత్రమే కేటాయించనున్నారు. మూడో దశ కరోనా మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సడలించిన నేపథ్యంలో ఏడు రోజుల ఐసొలేషన్‌ తర్వాత తిరిగి కరోనా పరీక్షలు లేకుండానే విధులకు అనుమతించనున్నారు. గతంలో నెగెటివ్‌ రిపోర్టుతో వెళ్తేనే విధుల్లోకి తీసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం మూడో దశ ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఐసోలేషన్‌ అనంతరం ఎలాంటి కరోనా పరీక్షలు లేకుండానే విధులకు హాజరుకావచ్ఛు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని