logo

ఆసుపత్రుల్లో వసతులు కల్పించాలి

కరోనా, ఓమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా జిల్లాలో కొవిడ్‌ టీకా లక్ష్యం నెరవేర్చాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదేశించారు. బుధవారం జగిత్యాల,

Published : 20 Jan 2022 02:27 IST

జూమ్‌ సమీక్షలో మంత్రి

జగిత్యాల, న్యూస్‌టుడే : కరోనా, ఓమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా జిల్లాలో కొవిడ్‌ టీకా లక్ష్యం నెరవేర్చాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదేశించారు. బుధవారం జగిత్యాల, పెద్దపల్లి కలెక్టర్లతో జూమ్‌ సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో పల్లె, పట్టణప్రగతి హరితహారం ధాన్యం సేకరణ కార్యక్రమాల్లో మంచి ఫలితాలు సాధించామని ఇదే స్ఫూర్తితో టీకా లక్ష్యాన్ని వందశాతం నెరవేర్చాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీకాపై ప్రతిరోజూ సమీక్షిస్తున్నారని జిల్లాలోని ధర్మపురి, మల్లాపూర్‌ ఆరోగ్య కేంద్రాల పరిధిలో టీకా తక్కువశాతం నమోదైందని ప్రజల్లో అవగాహన కల్పించి అర్హులైన ప్రతిఒక్కరికి టీకా ఇవ్వాలన్నారు. జిల్లాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు అవగాహన కల్పిస్తూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. ఆసుపత్రుల్లో అవసరమైన ఆక్సిజన్‌, పడకలు, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని మంత్రి అన్నారు. జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి డోస్‌ వందశాతం, రెండోడోసు 75 శాతం పూర్తయిందని 45 శాతం మంది టీనెజర్లకు టీకా ఇవ్వడమే కాకుండా బూస్టర్‌ డోస్‌ అర్హులందరికి ఇస్తున్నామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని