logo

అటు చదువు.. ఇటు ఆటలు

ఆటపై ఉన్న ఆసక్తి పలు విజయాలకు నాంది పలుకుతోంది. జిల్లా స్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీల్లో సత్తా చాటారు.. అదే ఉత్సాహంతో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనున్నారు. వీరంతా సబ్‌జూనియర్‌, జూనియర్‌ విభాగంలో

Published : 22 Jan 2022 02:22 IST

బాల్‌బ్యాడ్మింటన్‌లో ప్రతిభ

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

న్యూస్‌టుడే, మార్కండేయకాలనీ

బాల్‌బ్యాడ్మింటన్‌ ఆడుతున్న క్రీడాకారులు

ఆటపై ఉన్న ఆసక్తి పలు విజయాలకు నాంది పలుకుతోంది. జిల్లా స్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీల్లో సత్తా చాటారు.. అదే ఉత్సాహంతో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనున్నారు. వీరంతా సబ్‌జూనియర్‌, జూనియర్‌ విభాగంలో క్రీడా పోటీల్లో చురుగ్గా పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. అటు చదువు.. ఇటు క్రీడల్లో ఏమాత్రం తీసిపోకుండా రాణిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందినవారంతా.. ఇంట్లో తల్లిదండ్రుల ప్రోత్సాహం.. శిక్షకుల సహకారంతో బాల్‌బ్యాడ్మింటన్‌ క్రీడా పోటీల్లో రాణిస్తున్నారు. గోదావరిఖని పవర్‌హౌజ్‌కాలనీలో జిల్లా స్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలు ఇటీవల నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులు హాజరై పోటీల్లో పాల్గొన్నారు. శ్రీనివాస్‌, అశోక్‌, జోన్స్‌వర్షిత్‌, మహేందర్‌, రత్నాకుమార్‌, లిఖిత్‌కృష్ణ, తిరుపతి, అంజి, గణేష్‌, చందు, జాయిస్‌అభిషేక్‌ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. ఈ క్రీడాకారులు త్వరలో హైదరాబాద్‌ వనస్థలిపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.

ఎనిమిది సార్లు పతకాలు - జోన్స్‌వర్షిత్‌, డిగ్రీ విద్యార్థి

ఏడో తరగతి నుంచి బాల్‌బ్యాడ్మింటన్‌ క్రీడను ఎంచుకొని సాధన మొదలుపెట్టాను. శిక్షకుల మార్గదర్శకంలో ఇప్పటివరకు రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీల్లో ఎనిమిది సార్లు పాల్గొని నాలుగు వెండి పతకాలు సాధించాను. అదే విధంగా జాతీయ స్థాయి పోటీలు తమిళనాడు ఈ-రోడ్‌లో జరిగిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ధ్రువపత్రం అందుకున్నా.. ఇటీవల జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి హైదరాబాద్‌ వనస్థలిపురం క్రీడా మైదానంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం వహించనున్నా..  

పాఠశాల దశ నుంచే శిక్షణ - లిఖిత్‌కృష్ణ, డిప్లొమా విద్యార్థి

గోదావరిఖని పవర్‌హౌజ్‌కాలనీలో జరిగిన బాల్‌బ్యాడ్మింటన్‌ జిల్లా ఎంపిక ప్రక్రియలో ప్రతిభచాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాను. క్రీడలంటే చాలా ఇష్టం.. అందుకే ఎంత కష్టమైనా సమయాన్ని ఎక్కువగా క్రీడలకు కేటాయిస్తున్నా.. ఈ మాసంలో నిర్వహించే రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాలొననున్నాను. క్రీడల్లో చురుగ్గా ఉన్నానని శిక్షకులు నాపై దృష్టి సారించి మెలకువలు చెబుతున్నారు. పాఠశాల స్థాయి నుంచి బాల్‌బ్యాడ్మింటన్‌ శిక్షణ పొందుతున్నా. గతంలో కేరళ త్రిశూర్‌లో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ధ్రువపత్రం అందుకున్నా.. జెన్‌కోలో ఉద్యోగం సాధించాలన్నదే లక్ష్యం.

మెకానికల్‌ ఇంజినీర్‌ లక్ష్యం  -పి.జాయిస్‌అభిషేక్‌, డిప్లొమా విద్యార్థి

కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లొమా చదువుతున్నా.. మెకానికల్‌ ఇంజినీర్‌ కావాలన్నదే లక్ష్యం.. ప్రస్తుతం ఖాళీ సమయాన్ని క్రీడలపై దృష్టి సారించా. క్రీడల్లో బాల్‌బ్యాడ్మింటన్‌ను ఎంచుకున్నా. ఇప్పటి వరకు ఖమ్మం, మెదక్‌ జిల్లాలో జరిగిన సబ్‌జూనియర్‌ విభాగం పోటీల్లో ప్రతిభ కనబరిచి వెండి పతకాలు సాధించా. బోనకల్‌లో జరిగిన అండర్‌-19 బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచా. కేరళలో నిర్వహించిన జాతీయ స్థాయి సబ్‌ జూనియర్‌ విభాగంలో ప్రతిభ కనబరిచి ధ్రువపత్రం అందుకున్నా. మరింత సాధన చేసి అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని ప్రతిభ చాటుతాననే నమ్మకం నాకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని