logo

కేసీఆర్‌ పాలనలో మహిళలకు సంక్షేమ పథకాలు

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి వారిని గౌరవిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు.

Published : 13 Aug 2022 04:07 IST

మంత్రి గంగుల కమలాకర్‌

సీఎం కేసీఆర్‌ కటౌట్‌కు రాఖీలు కడుతున్న మహిళా కార్పొరేటర్లు,

నాయకురాళ్లు, మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు,

తెరాస జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు

రాంపూర్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి వారిని గౌరవిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా రాఖీ పండుగను పురస్కరించుకుని తెరాస జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణచౌక్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమైక్యత రక్షాబంధన్‌ వేడుకల్లో మహిళా కార్పొరేటర్లు, నాయకురాళ్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కటౌట్‌కు రాఖీలు కట్టారు. మంత్రి గంగుల మాట్లాడుతూ.. మహిళల కోసం పింఛన్లు, కల్యాణలక్ష్మి పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డను అన్నగా, మామగా కేసీఆర్‌ అండగా నిలుస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో తెరాస జిల్లా అధ్యక్షుడు, సుడా ఛైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, మేయర్‌ వై.సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణిహరిశంకర్‌, తెరాసవి జిల్లా కో-ఆర్డినేటర్‌ పి.అనిల్‌కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు. మంత్రి కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు, తెరాస అధ్యక్షుడు రామకృష్ణారావులకు పలువురు మహిళా కార్పొరేటర్లు, నాయకురాళ్లు రాఖీలు కట్టారు.

భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా శ్రీహరినగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ వై.సునీల్‌రావులు శుక్రవారం ఇంటింటికి జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ కచ్చు రవి, స్థానికులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని