logo

నీచ రాజకీయాలకు తెరలేపింది తెరాస, భాజపాలే

నీచ రాజకీయాలకు తెరలేపింది తెరాస, భాజపాలేనని మాజీ  ఎంపీ వి.హన్మంతరావు  విమర్శించారు. హుజూరాబాద్‌కు చేరుకున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. అంబేడ్కర్‌ కూడలి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో హన్మంతరావు

Published : 18 Aug 2022 06:34 IST

మాజీ ఎంపీ వి.హన్మంతరావు విమర్శ

హుజూరాబాద్‌లో మాట్లాడుతున్న హన్మంతరావు

హుజూరాబాద్‌ పట్టణం, హుజూరాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: నీచ రాజకీయాలకు తెరలేపింది తెరాస, భాజపాలేనని మాజీ  ఎంపీ వి.హన్మంతరావు  విమర్శించారు. హుజూరాబాద్‌కు చేరుకున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. అంబేడ్కర్‌ కూడలి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో హన్మంతరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోడు భూములను ఆక్రమించుకొని గిరిజనులు, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్‌ మాట్లాడే విధానం సరిగా లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పాలనలో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ యువత కోసం సాఫ్ట్ట్‌వేర్‌ రంగాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారన్నారు. నేడు మోదీ పాలనలో ప్రజలు కష్టపడుతున్నారన్నారు. పెద్దనోట్ల రద్దుతో ఎవరికి లబ్ధి చేకూరిందో చెప్పాలన్నారు. జాతీయ జెండా రూపకర్తను ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు మర్చిపోయారని ధ్వజమెత్తారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చేందుకు కుట్ర పన్నుతుందన్నారు.  రాష్ట్రంలో మాఫీయాకు కేసీఆర్‌ ప్రభుత్వం వత్తాసు పలుకుతుందన్నారు.  పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ మాట్లాడుతూ హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేరాల్చని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్‌రావు ఇంటి ఎదుట ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ చేస్తున్న పాదయాత్ర కాదని సీఎం కేసీఆర్‌ ప్రయోజిత యాత్ర అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలున్న విషయం వాస్తవమేనని, వాటిని  మేమే పరిష్కరించుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, నాయకులు బల్మూర్‌ వెంకట్‌ నర్సింగ్‌రావు, పత్తి క్రిష్ణారెడ్డి, గూడూరి స్వామిరెడ్డి, సొల్లు బాబు, గూడెపు సారంగాపాణి, రాజమల్లయ్య, కొల్లూరి కిరణ్‌కుమార్‌, సాహెబ్‌హుస్సేన్‌, పాదయాత్రలో ఎమ్మెల్యే సీతక్క, అంజన్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని