logo

జాతీయ స్థాయిలో జిల్లా ఘనత

స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ- 2023 ప్రోగ్రాం కింద నవంబర్‌ నెలలో ఇచ్చిన పారామీటర్ల ఆధారంగా జాతీయస్థాయిలో రాజన్న సిరిసిల్ల జిల్లా నాలుగు స్టార్‌ ర్యాంకింగ్‌ కేటగిరీలో మొదటిస్థానం కైవసం చేసుకున్నందుకు కలెక్టరేట్లో వేడుకలు నిర్వహించారు.

Published : 04 Dec 2022 05:39 IST

అధికారులు, ప్రజాప్రతినిధుల వేడుకలు

కేకు కోస్తున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ అరుణ, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల(విద్యానగర్‌), న్యూస్‌టుడే: స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ- 2023 ప్రోగ్రాం కింద నవంబర్‌ నెలలో ఇచ్చిన పారామీటర్ల ఆధారంగా జాతీయస్థాయిలో రాజన్న సిరిసిల్ల జిల్లా నాలుగు స్టార్‌ ర్యాంకింగ్‌ కేటగిరీలో మొదటిస్థానం కైవసం చేసుకున్నందుకు కలెక్టరేట్లో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జడ్పీ ఛైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ హాజరై కోకు కోశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశస్థాయిలో రాజన్న సిరిసిల్ల జిల్లా 4 స్టార్‌ ర్యాంకింగ్‌ కేటగిరీలో మొదటిస్థానం కైవసం చేసుకోవడం జిల్లాకు గర్వకారణమన్నారు. రాష్ట్ర ఏర్పాటు తరవాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో పల్లె ప్రగతి, హరితహారం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, తండాలను గ్రామ పంచాయతీలు చేసి, రాష్ట్రంలోని ప్రతి గ్రామం పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండటం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, జడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి రవీందర్‌, అదనపు డీఆర్‌డీవో మదన్‌మోహన్‌, ఎంపీడీవోలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ పవర్‌లూం, టెక్స్‌టైల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌ ముఖ్య అతిథిగా హాజరై కేక్‌ కట్ చేశారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, తెరాస జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.

యంత్రాంగానికి కేటీఆర్‌ అభినందనలు

మంత్రి కేటీఆర్‌ జిల్లా అధికారులకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మీ నిరంతర మార్గదర్శనం, ప్రజా ప్రతినిధులు, అధికారుల కృషి ఫలితమేనని జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ప్రతిగా ట్వీట్‌ చేశారు. ప్రతి మండలంలో వేడుకలు చేసుకోవాలని సూచించారు. ఇదే స్ఫూర్తితో పని చేస్తూ స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ 2023లో అగ్రభాగాన నిలపాలని తెలిపారు.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు