logo

అబద్ధాలతో ప్రజలను మోసగిస్తున్న కేసీఆర్‌

వినసొంపైన అబద్ధాలతో రాష్ట్ర ప్రజలను మోసగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పబ్బం గడుపుతున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు, హుజూరాబాద్‌ శాసనసభ్యుడు ఈటల రాజేందర్‌ అన్నారు.

Published : 01 Feb 2023 05:02 IST

హుజూరాబాద్‌ శాసన సభ్యుడు ఈటల

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజేందర్‌

చొప్పదండి, న్యూస్‌టుడే: వినసొంపైన అబద్ధాలతో రాష్ట్ర ప్రజలను మోసగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పబ్బం గడుపుతున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు, హుజూరాబాద్‌ శాసనసభ్యుడు ఈటల రాజేందర్‌ అన్నారు. మంగళవారం మండలంలోని గుమ్లాపూర్‌లోని ఓ ప్రైవేటు వేడుకల మందిరంలో నిర్వహించిన ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకుని ముద్దాడుతున్నారని కేసీఆర్‌ ఇటీవల వ్యాఖ్యలు చేశారు.. ఆ వ్యాఖ్యలు ఆయనకే వర్తిస్తాయనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జరుగుతుందని తెలుసుకోవాలన్నారు. రైతుబంధుతో భూస్వాములకు లక్షలాది రూపాయలు ఇస్తూ పేద రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆరు గుంటల భూమి ఉన్నా ఆరు ఎకరాల భూమి ఉన్నా సమ న్యాయం పాటిస్తూ ఆరు వేలు చెల్లిస్తుందని పేర్కొన్నారు. లీటర్‌ పెట్రోల్‌లో రాష్ట్రానికి రూ.41.50 పన్ను చెల్లిస్తే, కేంద్రానికి కేవలం రూ.19.50 మాత్రమే చెల్లిస్తున్నామని ఈ విషయం తెలుసుకోవాలన్నారు. ప్రోటోకాల్‌ ఉల్లంఘన రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యదర్శి కె.మాధవి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను విస్మరించి స్వార్థ రాజకీయాల కోసం భారాసను ఏర్పాటు చేశారని విమర్శించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, నాయకులు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, శివరామకృష్ణ, అనిల్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్‌గౌడ్‌, వాసుదేవరెడ్డి, ప్రవీణ్‌రావు, రమేశ్‌, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని