logo

మహా శివరాత్రి జాతరకు భారీ భద్రత

మహా శివరాత్రి జాతరకు భారీ భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ పేర్కొన్నారు. వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 17 నుంచి 19 వరకు జరిగే మహా శివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన భద్రతా  ఏర్పాట్లపై పోలీసు, ఆలయ అధికారులతో కలిసి సోమవారం ఎస్పీ పరిశీలించారు.

Published : 07 Feb 2023 06:03 IST

ఏర్పాట్లపై పోలీసు అధికారులకు సూచనలు చేస్తున్న ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, చిత్రంలో డీఎస్పీ నాగేంద్రచారి, ఈవో కృష్ణ ప్రసాద్‌

వేములవాడ, న్యూస్‌టుడే: మహా శివరాత్రి జాతరకు భారీ భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ పేర్కొన్నారు. వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 17 నుంచి 19 వరకు జరిగే మహా శివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన భద్రతా  ఏర్పాట్లపై పోలీసు, ఆలయ అధికారులతో కలిసి సోమవారం ఎస్పీ పరిశీలించారు. ఆలయ పరిసరాల్లోని దర్శన ప్రదేశాలు, ధర్మగుండం, శివార్చన వేదిక, వీఐపీ, జనరల్‌ పార్కింగ్‌ ప్రదేశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహా శివరాత్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా భద్రత చర్యలు చేపడతామని చెప్పారు. జాతర సందర్భంగా వేములవాడ పట్టణం, దేవాలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానం చేసి 24 గంటలూ నిఘా పెట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వాహనాలతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్‌ మళ్లింపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వాహనాల పార్కింగ్‌ స్థలాలను గుర్తించి వాటిని క్రమ పద్ధతిలో నిలపడానికి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. భక్తుల క్యూలైన్లకు సంబంధించిన, పార్కింగ్‌ ప్రదేశాలకు వెళ్లే దారుల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్‌, డీఎస్పీ నాగేంద్రచారి, పట్టణ సీఐ వెంకటేష్‌, ఈఈ రాజేష్‌, ఆలయ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని