logo

రంజాన్‌ ఏర్పాట్లపై సమీక్ష

రంజాన్‌ పండగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం రంజాన్‌ మాసం ప్రారంభం సందర్భంగా ఏర్పాట్లపై వివిధశాఖల అధికారులు ముస్లిం మత పెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

Published : 24 Mar 2023 04:14 IST

సమావేశంలో కలెక్టర్‌ యాస్మిన్‌బాషా, ఎస్పీ భాస్కర్‌

జగిత్యాల, న్యూస్‌టుడే: రంజాన్‌ పండగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం రంజాన్‌ మాసం ప్రారంభం సందర్భంగా ఏర్పాట్లపై వివిధశాఖల అధికారులు ముస్లిం మత పెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో పండగ జరుపుకోవాలని ప్రభుత్వ ఆదేశం మేరకు రంజాన్‌ మాసంలో చేయాల్సిన ఏర్పాట్లపై ఇదివరకే వివిధ శాఖల అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. ఉపవాస దీక్షల సమయంలో మసీదుల వద్ద పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని తాగునీరు అందుబాటులో ఉంచాలని విద్యుత్తు ఇబ్బందులు లేకుండా చూడాలని వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా ఎస్పీ ఎ.భాస్కర్‌ మాట్లాడుతూ పరస్పరం మతాలను గౌరవించుకుంటూ పండగను నిర్వహించుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని ఎలాంటి సంఘటనలు జరిగినా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రార్థనా సమయాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూడాలని మసీదుల వద్ద పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు ఆర్‌.డి.మాధురి, టి.వినోద్‌కుమార్‌, జగిత్యాల, మెట్‌పల్లి డీఎస్పీలు ఆర్‌.ప్రకాశ్‌, వి.రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ఆస్తిపన్ను వసూలు చేయాలి : కలెక్టర్‌

జగిత్యాల పట్టణంలో వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా అన్నారు. గురువారం ఆస్తిపన్నుపై పురపాలక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రూ.12.40 కోట్ల ఆస్తి బకాయిలుండగా ఇప్పటి వరకు రూ.6.52 కోట్లు వసూలు అయ్యాయని మిగతా బకాయిలు ఈనెల 31లోపు వసూలు చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు గత సంవత్సరం కంటే 6 శాతం అదనంగా పన్ను బకాయిలు వసూలు చేస్తేనే 15వ ఆర్థిక సంఘం, అమృత్‌, స్వచ్ఛ సర్వేక్షణ్‌ నిధులకు అర్హత ఉంటుందని ఇప్పటి వరకు 52 శాతం పన్నులు వసూలు జరిగిందన్నారు.  ఇన్‌ఛార్జి పురపాలక ఛైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, అదనపు కలెక్టర్‌ మంద మకరందు, కమిషనర్‌ నరేష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని