పాఠశాల విద్యార్థులకు రాత పుస్తకాలు
సర్కారు బడుల్లోని విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపడుతోంది.
తేలిన లెక్క.. పంపిణీకి సన్నాహాలు
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు
న్యూస్‌టుడే-కరీంనగర్ విద్యావిభాగం: సర్కారు బడుల్లోని విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం, బోధన ఉచితంగా అందిస్తున్నా.. రాత పుస్తకాలు కొనడం తల్లిదండ్రులకు భారంగా మారింది. ఈ ఏడాది నుంచి ఆ ఖర్చు కూడా లేకుండా ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయనుంది. ఉమ్మడి జిల్లాలో ఎన్ని నోట్ బుక్స్ అవసరమవుతాయో రాష్ట్ర విద్యా శాఖ తేల్చింది.
ఉమ్మడి జిల్లాకు 11.07 లక్షలు..
కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని ప్రభుత్వ, స్థానిక సంస్థల, కేజీబీవీ, ఆదర్శ, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలతోపాటు గురుకులల్లోని విద్యార్థులకు ఉచితంగా రాత పుస్తకాలు (లాంగ్ నోటు బుక్స్) అందించనున్నారు. 6-12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 11,07,181 అవసరమని విద్యాశాఖ అధికారులు గుర్తించారు. విద్యాసంవత్సరం పూర్తయ్యే నాటికి అవి సరిపోకున్నా... తల్లిదండ్రులపై కొంతమేర భారం తప్పనుంది. వీటి పంపిణీ తర్వాత మళ్లీ ఇస్తారా లేదా? అనే దానిపై స్పష్టత లేదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్