logo

మిల్లుల్లోనే బియ్యం.. ధాన్యానికేదీ స్థలం?

గత వానాకాలం సీజన్‌కు సంబంధించిన బియ్యానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో మిల్లుల్లోనే నిల్వలు పేరుకుపోయాయి. గత సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ లక్ష్యాలను మిల్లర్లు పూర్తి చేయాలనే గడువును జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు.

Published : 18 Apr 2024 04:22 IST

ఓ బియ్యం మిల్లులో పేరుకుపోయిన బియ్యం నిల్వలు

న్యూస్‌టుడే, సుల్తానాబాద్‌ : గత వానాకాలం సీజన్‌కు సంబంధించిన బియ్యానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో మిల్లుల్లోనే నిల్వలు పేరుకుపోయాయి. గత సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ లక్ష్యాలను మిల్లర్లు పూర్తి చేయాలనే గడువును జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు. మిల్లర్లు బియ్యాన్ని అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నా గిడ్డంగిలో నిల్వ చోటులేదనే కారణంగా అధికారులు బియ్యాన్ని అనుమతించడం లేదు. మరోవైపు యాసంగి సంబంధించిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయిస్తున్న తరుణంలో మిల్లుల్లో ఖాళీ స్థలం లేక ధాన్యాన్ని నిల్వ చేసేందుకు మిల్లు యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ అద్దె కారణంగా ప్రభుత్వం బియ్యం నిల్వల తరలింపునకు మండలంలో కేవలం ఒకే గిడ్డంగి (పెగ్‌ గిడ్డంగి)ని కేటాయించడంతో ఖాళీ స్థలం లేకుండా పోయింది. మండలంలోని అయిదు గిడ్డంగుల్లో నిల్వలు లేక అవి ఖాళీగా అందుబాటులో ఉన్నా కూడా బియ్యం నిల్వ చేయడానికి అధికారులు అనుమతించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బియ్యం నిల్వలను ఎప్పటికప్పుడు తరలించేలా జిల్లా అధికారులు మరిన్ని గిడ్డంగులకు అనుమతి ఇవ్వాలని మిల్లర్లు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని