logo

క్లిక్‌ దూరంలో సమగ్ర సమాచారం

ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించింది. ceotelangana.nic.in లో ఓటరు నమోదుతో పాటు సవరణలు, తొలగింపులు తదితర అంశాలుంటాయి.

Updated : 18 Apr 2024 05:16 IST

రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం: ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించింది. ceotelangana.nic.in లో ఓటరు నమోదుతో పాటు సవరణలు, తొలగింపులు తదితర అంశాలుంటాయి. పోలింగ్‌ కేంద్రం వివరాలతో పాటు ఎన్నికల్లో జరిగే అవకతవకాలపై ఫిర్యాదులు, ఏయే స్థాయిల్లో ఎన్ని నిమిషాల్లో పరిష్కారమవుతాయో వివరాలుంటాయి. ఓటరు జాబితాలో పేరు చూసుకోవడంతో పాటు గతంలో జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా పోటీ చేసిన అభ్యర్థుల ఆస్తుల వివరాలతో కూడిన అఫిడవిట్లు చూడవచ్చు. ఆయా అంశాలను డౌన్‌లోడ్‌ కూడా చేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌, యూట్యూబ్‌ తదితర సామాజిక మాధ్యమాల లింకులు సైతం అందుబాటులో ఉంటాయి. ఓటర్లకు ఉపయోగపడే మొబైల్‌ యాప్‌ల వివరాలుంటాయి. ఓటరు గుర్తింపు కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫిర్యాదుల వివరాలు, పరిష్కారం తీరును తెలుసుకోవచ్చు. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల వివరాలను  eci.gov.in వెబ్‌సైట్‌లో కూడా చూడవచ్చు. రాష్ట్రానికి సంబంధించిన వివరాలను ceotelangana.nic.in లో నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసుకొని తెలుసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని