logo

కొప్పుల మొదటిసారి.. జీవన్‌ మూడోసారి

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో వేర్వేరు పార్టీలు, వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న తాటిపర్తి జీవన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌లకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్‌రెడ్డి స్వగ్రామం పెగడపల్లి మండలం బతికెపల్లి.

Updated : 18 Apr 2024 05:13 IST

లోక్‌సభ బరిలో మాజీ మంత్రులు

న్యూస్‌టుడే, ధర్మారం: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో వేర్వేరు పార్టీలు, వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న తాటిపర్తి జీవన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌లకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్‌రెడ్డి స్వగ్రామం పెగడపల్లి మండలం బతికెపల్లి. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మూడు సార్లు మంత్రిగా పని చేశారు. ఎంపీ పదవికి భారాస అధినేత కేసీఆర్‌ రాజీనామాతో వచ్చిన 2006, 2008 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా జీవన్‌రెడ్డి బరిలో నిలిచారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయన ప్రస్తుతం నిజామాబాద్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక 2004 నుంచి 2018 వరకు రెండు ఉప ఎన్నికలతో కలిపి వరుసగా ఆరు ఎన్నికల్లో (మేడారం నుంచి రెండు సార్లు, ధర్మపురి నుంచి నాలుగు సార్లు) గెలిచి చీఫ్‌విప్‌గా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కొప్పుల ఈశ్వర్‌, లోక్‌సభ బరిలో మొదటిసారి పెద్దపల్లి నుంచి బరిలో నిలిచారు. ఆయన స్వగ్రామం జూలపల్లి మండలం కుమ్మరికుంట కాగా గోదావరిఖనిలో స్థిరపడ్డారు. రాజకీయాల్లోకి రాకముందు సింగరేణి కార్మికుడిగా పని చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని