logo

న్యాయస్థానాల్లో మౌలిక సౌకర్యాలు అవసరం

న్యాయస్థానాల్లో మౌలిక సౌకర్యాలను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి సూచించారు. బళ్లారిలోని తాళూరు రహదారిలో కొత్తగా నిర్మించిన జిల్లా న్యాయస్థానం భవనాన్ని ఆదివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించి ప్రసంగించారు. వేగవంతంగా న్యాయం అందిస్తామని చెప్పారు. న్యాయస్థానాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

Published : 27 Jun 2022 02:47 IST

ఆవరణలో మొక్క నాటి నీరు వేస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి
 

బళ్లారి, న్యూస్‌టుడే : న్యాయస్థానాల్లో మౌలిక సౌకర్యాలను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి సూచించారు. బళ్లారిలోని తాళూరు రహదారిలో కొత్తగా నిర్మించిన జిల్లా న్యాయస్థానం భవనాన్ని ఆదివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించి ప్రసంగించారు. వేగవంతంగా న్యాయం అందిస్తామని చెప్పారు. న్యాయస్థానాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తగిన మౌలిక సదుపాయాలు లేకుంటే చట్టాలు అమలు చేయడం కష్టమవుతుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని వృత్తులతోపాటు న్యాయవాది వృత్తిని కూడా మార్చివేసిందన్నారు. బళ్లారి జిల్లా న్యాయవాదుల సంఘం ప్రతినిధులు సమస్యలను ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకురాగా.. వాటిని పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా న్యాయస్థానం పరిపాలన బాధ్యులు జస్టిస్‌ ఆర్‌.దేవదాస్‌ అధ్యక్షత వహించి మాట్లాడారు. రాష్ట్రంలోని బళ్లారి న్యాయస్థానం భవనం పెద్దదని, విశాలమైన ప్రాంగణం ఉందన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.నటరాజన్‌ మాట్లాడుతూ తనకు బళ్లారి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. కర్ణాటక న్యాయపరిషత్‌ సభ్యుడు కె.కోటేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమంలో కర్ణాటక న్యాయవాదుల పరిషత్‌ సభ్యుడు జె.ఎం.అనిల్‌కుమార్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.హెచ్‌.పుష్పాంజలి దేవి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.ఎర్రిగౌడ, సభ్యులు వీరంద్రనాథ, నాగరాజనాయక్‌, త్రివేణి పత్తార్‌, ప్రజాపనులశాఖ ఇంజినీరు పూజారి, బళ్లారి న్యాయవాదుల సంఘం ట్రెజరర్‌ ఈరేశ, బళ్లారి, విజయనగర జిల్లాల న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం న్యాయమూర్తులు, న్యాయవాదుల సంఘం సభ్యులు, ప్రజాపనుల శాఖాధికారులను సన్మానం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని