logo

పంచాయతీ గ్రంథాలయాల డిజిటలీకరణ

రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలోని గ్రంథాలయాలను డిజిటలీకరణ చేసే భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని గ్రామ డిజి వికసన కార్యక్రమం, శిక్షణ ఫౌండేషన్‌ విజయనగర జిల్లా అధికారి చరంతయ్య హిరేమఠ పేర్కొన్నారు.

Published : 30 Jun 2022 00:46 IST

అవగాహన కల్పిస్తున్న అధికారి చరంతయ్య హిరేమఠ

హొసపేటె, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలోని గ్రంథాలయాలను డిజిటలీకరణ చేసే భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని గ్రామ డిజి వికసన కార్యక్రమం, శిక్షణ ఫౌండేషన్‌ విజయనగర జిల్లా అధికారి చరంతయ్య హిరేమఠ పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా బుధవారం పంచాయతీల గ్రంథాలయాల నిర్వాహకులకు గ్రామ డిజి వికసనపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓ కంప్యూటర్‌ తయారు సంస్థ, సంబంధించిన జిల్లా పంచాయతీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. పంచాయతీ పరిధిలోని గ్రంథాలయాలకు కూడా పెద్దఎత్తున విద్యార్థులు, యువకులు సమాచారం కోసం వెళ్తున్నారు. వారికి సాంకేతిక సమాచారం కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పంచాయతీలోని గ్రంథాలయాలను డిజిటలీకరణ చేస్తున్నామని చెప్పారు. ప్రతీ గ్రంథాలయానికి అత్యాధునిక టీవీ, నాలుగు నాజూకు చరవాణులు, ఇతర సాంకేతిక పరికరాలను అందిస్తున్నాం. గ్రంథాలయానికి వచ్చిన విద్యార్థులు, యువకులు వాటిద్వారా సాంకేతిక సమాచారాన్ని తెలుసుకునేందుకు సాధ్యపడుతుందని వివరించారు. ఉన్నత చదువులు చదివిన గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నైపుణ్యత, భావవ్యక్తీకరణ గుణాలు లేకపోవడంతో వారి చదువులకు తగిన ఉద్యోగాలు దొరకడంలేదని అన్నారు. అ నేపథ్యంలో గ్రంథాలయాలను డిజిటలీకరించి, వారికి తగిన సమాచార అందించే ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1200 గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామ డిజి వికసన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. విజయనగర జిల్లాలోని ఆరు తాలూకాల్లో ఈ అవగాహన కార్యక్రమం చేపడుతున్నామని ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని