logo

బ్యాంకులో భారీదోపిడీ

దొడ్డబళ్లాపుర సమీపంలోని హొసహళ్లి కర్ణాటక గ్రామీణ బ్యాంకులో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది.

Published : 28 Nov 2022 02:52 IST

ఐదు కిలోల బంగారం దొంగలపాలు

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : దొడ్డబళ్లాపుర సమీపంలోని హొసహళ్లి కర్ణాటక గ్రామీణ బ్యాంకులో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దొంగతనం జరిగిన విషయాన్ని ఆదివారం ఉదయం గుర్తించారు. ముసుగులు ధరించి వచ్చిన నలుగురు ఆగంతకులు ఐదు కిలోల ఆభరణాలు, రూ.14 లక్షల నగదుతో పరారయ్యారు. బ్యాంకుకు శని, ఆదివారం సెలవు. షట్టరు తాళం తీసి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో బ్యాంకు ప్రతినిధులు అక్కడకు వచ్చి దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ సొత్తు విలువను రూ.3.5 కోట్లుగా అంచనా వేశారు. బెంగళూరు గ్రామీణ ఎస్పీ మల్లికార్జున బాలదండి, ఇతర పోలీసు అధికారులు బ్యాంకులోని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించారు. సెలవు రోజుల్లో లాకర్‌ తెరిస్తే సైరన్‌ మోగే సదుపాయం బ్యాంకులో ఉంది. కానీ, సైరన్‌ మోగకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని మల్లికార్జున తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని