logo

పుస్తకమే బహుమతి

చెన్నైలోని అమెరికా కాన్సులేట్‌ రాజకీయ ఆర్థిక విభాగం బాధ్యురాలు విస్పా పర్కిన్స్‌ సోమవారం రాత్రి బెంగళూరు నగరంలో మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి.దేవేగౌడతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు.

Published : 30 Nov 2022 00:38 IST

చెన్నైలోని అమెరికా కాన్సులేట్‌ రాజకీయ ఆర్థిక విభాగం బాధ్యురాలు విస్పా పర్కిన్స్‌ సోమవారం రాత్రి బెంగళూరు నగరంలో మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి.దేవేగౌడతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. పద్మనాభనగరలోని గౌడ నివాసానికి చేరుకున్న ఆమె.. ఆయన ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు. వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆమె రాక సంతోషం కలిగించిందని గౌడ ట్వీట్‌ చేశారు. పాత్రికేయుడు సుగత శ్రీనివాస్‌రాజు రాసిన ‘దేవేెగౌడ జీవిత చరిత్ర’ ఆంగ్ల పుస్తకాన్ని ఆమెకు అందజేశారు.

న్యూస్‌టుడే, యశ్వంతపుర

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని