logo

ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు

రెండు వేర్వేరు కేసులల్లో బాలికలపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులకు నగర న్యాయస్థానం జీవిత ఖైదు శిక్షను విధించింది. సింగసంద్రలో మెడికల్‌ గ్యాసు సిలిండర్ల వ్యాపారం చేసే మంజునాథరావు- పూజలు చేసి దోషాలు పోగొడతానని ప్రచారం చేసుకున్నాడు.

Published : 29 Jan 2023 04:02 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : రెండు వేర్వేరు కేసులల్లో బాలికలపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులకు నగర న్యాయస్థానం జీవిత ఖైదు శిక్షను విధించింది. సింగసంద్రలో మెడికల్‌ గ్యాసు సిలిండర్ల వ్యాపారం చేసే మంజునాథరావు- పూజలు చేసి దోషాలు పోగొడతానని ప్రచారం చేసుకున్నాడు. తన కుమార్తె (17) ఎప్పుడూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుందని వచ్చిన ఒక మహిళను నమ్మించి పూజలకు ఉపక్రమించాడు. నాగదోషం ఉందని నమ్మించాడు. ఒంటరిగా పూజలు చేయాలంటూ పలుసార్లు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడడంతో ఆమె గర్భవతి అయ్యింది. జరిగిన ఘోరాన్ని తెలుసుకున్న బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పరప్పన అగ్రహార ఠాణా పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితునికి జీవిత ఖైదు శిక్షను విధిస్తూ న్యాయమూర్తి ఇష్రత్‌ జహాన్‌ తీర్పు ఇచ్చారు. మరో ఘటన- పుట్టేనహళ్లి పరిధిలో చోటు చేసుకుంది. ఒక బాలిక (14)కు మాయమాటలు చెప్పి, తినుబండారాలు ఇప్పిస్తానని వరదరాజు అనే వ్యక్తి నాలుగుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పుట్టేనహళ్లి ఠాణా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితునికి శిక్షను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని