logo

నిరంతరం కన్నడ ఉత్సవాలు

మాతృభాషను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని ముఖ్యమంత్రి బొమ్మై పేర్కొన్నారు.

Published : 05 Feb 2023 06:53 IST

ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి బొమ్మై

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : మాతృభాషను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని ముఖ్యమంత్రి బొమ్మై పేర్కొన్నారు. ఓ ప్రముఖ కన్నడ దిన పత్రిక శనివారం బెంగళూరులో ఏర్పాటు చేసిన ‘కన్నడ పండుగ’ను ఆయన ప్రారంభించారు. నట, దర్శకుడు- కాంతార సినిమా ఫేమ్‌- రిషబ్‌ శెట్టిని ఇదే వేదికపై సత్కరించి మాట్లాడారు. మాతృభాష పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర సరిహద్దులకు అటు- ఇటు ఉన్న కన్నడ మాధ్యమ పాఠశాలలలో సదుపాయాలు కల్పించేందుకు సరిహద్దు అభివృద్ధి ప్రాధికారకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. నవంబరు నెలకు మాత్రమే కాకుండా ఏడాది పూర్తిగా కన్నడ భాష పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు, కన్నడాభిమానులు నిరంతరం కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని