logo

కేంద్ర కారాగారంలో ఆకస్మిక తనిఖీలు

కేంద్ర కారాగాన్ని జిల్లా పోలీస్‌ అధికారి రంజిత్‌కుమార్‌ బండారు తమ అధికారులు, సిబ్బందితో కలిసి మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు.

Published : 22 Mar 2023 02:49 IST

మూడు చరవాణులు, సిమ్‌ కార్డులు స్వాధీనం

సిమ్‌కార్డులు, చరవాణులు ఉపయోగిస్తున్న ఖైదీలతో పోలీస్‌ అధికారులు, జైలు అధికారులు

బళ్లారి, న్యూస్‌టుడే: కేంద్ర కారాగాన్ని జిల్లా పోలీస్‌ అధికారి రంజిత్‌కుమార్‌ బండారు తమ అధికారులు, సిబ్బందితో కలిసి మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. జైల్లోని వివిధ బ్లాక్‌లను జల్లెడ పట్టగా ఒక్కొక్క సిమ్‌ కార్డ్‌ ఉన్న మూడు చరవాణులు, మూడు ప్రత్యేక సిమ్‌కార్డులను గుర్తించి స్వాధీనం చేసుకుని ఖైదీలపై బళ్లారి గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకున్నారు. బళ్లారి కేంద్ర కారాగారంలో ఉంటున్న ఖైదీలు చరవాణి ఉపయోగిస్తున్నారు. గంజాయి కూడా వాడుతున్నారని ముందుగా అందిన సమాచారంతో ఎస్పీ రంజిత్‌కుమార్‌, నగర డీఎస్పీ కె.బసవరాజ, సీఐలు శ్రీనివాసమేటి, సిద్దరామేశ్వర, ఎం.ఎస్‌.సిందూరు, వాసుకుమార్‌, బసవరాజ పాటిల్‌, గుండూరావ్‌, అంబరేశ్‌ హుబ్బళ్లి, గోవింద, ఎస్‌.ఐలు తదితర 100 మంది పోలీసులు ఉదయం 6 గంటలకు కేంద్ర కారాగారానికి చేరుకున్నారు. ఖైదీలు ఉంటున్న బ్లాక్‌లను జల్లెడ పట్టారు. ఒక్కొక్క బ్లాక్‌ను రెండు గంటలకుపైగా పరిశీలించారు. ఖైదీలు ఉంటున్న బ్లాక్‌లో సంచులు, దుస్తులు తదితర వాటిని తనిఖీ చేయగా మూడు చరవాణులు, ఛార్జర్లు, మూడు సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌ అధికారులకు జైలు ముఖ్య పర్యవేక్షకురాలు లత, ఉప పర్యవేక్షకులు అంబరీశ్‌ పూజారి, తదితర జైలు అధికారులు, సిబ్బంది కూడా సహకరించారు. సిమ్‌ కార్డులతో పాటు, చరవాణులు ఉపయోగిస్తున్న ఖైదీలపై బళ్లారి గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి వాటికి తావు లేకుండా అధికారులు తరుచు పరిశీలించాలని జైలు అధికారులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని