logo

వేడుకగా సాహస జలక్రీడలు

రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ, మంత్ర సర్ఫ్‌ క్లబ్‌ నేతృత్వంలో నాలుగో భారతీయ జాతీయ ఓపెన్‌ సర్ఫింగ్‌ పోటీల్లో కర్ణాటకకు చెందిన సించనగౌడ, ప్రదీప్‌పూజార్‌తో పాటు తమిళనాడు సాహసికులు తమ ప్రతిభా సామర్థ్యాలతో దూసుకెళ్లారు.

Published : 03 Jun 2023 01:06 IST

కర్ణాటక సర్ఫర్‌ సించనాగౌడ జోరు

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడేే : రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ, మంత్ర సర్ఫ్‌ క్లబ్‌ నేతృత్వంలో నాలుగో భారతీయ జాతీయ ఓపెన్‌ సర్ఫింగ్‌ పోటీల్లో కర్ణాటకకు చెందిన సించనగౌడ, ప్రదీప్‌పూజార్‌తో పాటు తమిళనాడు సాహసికులు తమ ప్రతిభా సామర్థ్యాలతో దూసుకెళ్లారు. అంతర్జాతీయస్థాయిలో భారత జట్టు ఎంపిక ట్రయల్స్‌గా ఈ పోటీలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మంగళూరులోని శశిత్లు తీరంలో శుక్రవారం నిర్వహించిన ఈ సాహస జల క్రీడల పురుషుల విభాగంలో తమిళనాడు సర్ఫర్లు డి.శ్రీకాంత్‌, కిశోర్‌కుమార్‌ అత్యధికంగా 13 పాయింట్లతో ముందంజ వేశారు. మహిళల విభాగంలో తమిళనాడుకు చెందిన కమలీమూర్తి (8.50), సృష్టీ సెల్వం (4.74)తో కర్ణాటకకు చెందిన సించనాగౌడ (5.17) ఢీకొని ఫైనల్స్‌కు అర్హత సాధించారు. అండర్‌-16 వయోవిభాగంలో రేవు గ్రోమ్స్‌, గోవాకు చెందిన సుగర్‌ బన్సారె ఫైనల్స్‌లో ఢీకొంటారు. క్వార్టర్‌ ఫైనల్స్‌ పోటీలో సంజయ్‌కుమార్‌, డి.శ్రీకాంత్‌, రఘుల్‌పన్నీర్‌ సెల్వం, సతీష్‌శరవణన్‌, ఎం.మణికందన్‌, కిశోర్‌కుమార్‌, సంతోష్‌, పి.సూర్య తలపడి- సత్తా చాటి సెమీస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఫైనల్స్‌కు చేరుకొన్న కిశోర్‌కుమార్‌ మాట్లాడుతూ జాతీయ పోటీల నిర్వహణ ఉత్కంఠభరితంగా ఉందన్నారు. ఇలాంటి వేదికలు క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపుతాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు