logo

రూపు రేఖలు మారనున్న మినీ అంగన్‌వాడీ కేంద్రాలు

మినీ అంగన్‌వాడీ కేంద్రాల రూపు రేఖలు మారనున్నాయి. పదిహేనేళ్లుగా మినీ అంగన్‌వాడీల ఏర్పాటుతో స్త్రీశిశు సంక్షేమశాఖ ద్వారా ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సేవలందిస్తోంది.

Published : 06 Aug 2022 03:43 IST

అశ్వారావుపేట, న్యూస్‌టుడే

మినీ అంగన్‌వాడీ కేంద్రాల రూపు రేఖలు మారనున్నాయి. పదిహేనేళ్లుగా మినీ అంగన్‌వాడీల ఏర్పాటుతో స్త్రీశిశు సంక్షేమశాఖ ద్వారా ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సేవలందిస్తోంది. ఏళ్ల తరబడి ఒకే టీచర్‌తో సమస్యల మధ్య నడుస్తున్న ఈ కేంద్రాలు ఇకనుంచి ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి. ఇందుకు సంభందించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లా పథక సంచాలకులకు ఉత్తర్వులు విడదలయ్యాయి. కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రధాన కేంద్రాలకు ఏ సౌకర్యాలున్నాయో అవే సౌకర్యాలుతో పాటు ఒక ఆయాను మినీ అంగన్‌వాడీకీ కల్పించనున్నారు.

* జనాభా, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో గతంలో మినీ అంగన్‌వాడీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జనాభా, చిన్నారుల సంఖ్య పెరగడంతో ఆ కేంద్రాల్లో సేవలందించడం ఇబ్బందికరంగా ఉండటంతో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల సంఘ నాయకులు ప్రభుత్వానికి పలు వినతులు సమర్పించారు. దీంతో స్పందించిన కేంద్రం అందుకనుగుణంగా ఆదేశాలిచ్చింది. ఇదిలాఉండగా గిరిజన ప్రాంతాల్లో 300 మంది, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 400మంది జనాభా ఉన్న ప్రాంతాల్లోని మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఇకనుంచి ప్రధాన కేంద్రాలుగా మార్చేందుకు ప్రాథమికంగా మినీ అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో సర్వే ప్రారంభించారు.

మినీ అంగన్‌వాడీలను ప్రధాన కేంద్రాలుగా మార్చేందుకు భద్రాద్రి జిల్లాలో మినీ కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో జనాభా సర్వే ప్రారంభించాము. జనాభా లెక్క  ప్రకారం మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. సమగ్ర సర్వే తరువాత వివరాలు తెలుస్తాయి.

- ఐసీడీఎస్‌ పీడీ వరలక్ష్మి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని