logo

తుదిపోరు.. యమజోరు

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా జరుగుతున్న 6వ ఇంటర్‌ సొసైటీ లీగ్‌ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు గురువారం ముగిశాయి. నాలుగు రోజులపాటు కిన్నెరసాని క్రీడా పాఠశాల వేదికగా సందడిగా సాగిన పోటీల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Published : 02 Dec 2022 02:55 IST

ముగిసిన ఇంటర్‌ సొసైటీ లీగ్‌ రాష్ట్రస్థాయి పోటీలు

ఓవరాల్‌ ఛాంపియన్‌ ట్రోఫీతో మొదటి స్థానంలో నిలిచిన సోషల్‌ వెల్ఫేర్‌ టీం క్రీడాకారులు

పాల్వంచ(జగన్నాథపురం), న్యూస్‌టుడే: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా జరుగుతున్న 6వ ఇంటర్‌ సొసైటీ లీగ్‌ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు గురువారం ముగిశాయి. నాలుగు రోజులపాటు కిన్నెరసాని క్రీడా పాఠశాల వేదికగా సందడిగా సాగిన పోటీల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. 148 మంది రిఫరీలు, 550 మంది వ్యాయామ ఉపాధ్యాయులు, 20 ఆర్గనైజింగ్‌ కమిటీల్లో 300 మంది వివిధ సొసైటీ ఉద్యోగులు, 300 మంది వంట సిబ్బంది, 3500 మంది క్రీడాకారులతో 13 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. ఐటీడీఏ పీవో గౌతమ్‌ పోట్రు ప్రత్యేక పర్యవేక్షణలో వసతి, భోజన విషయంలో లోటుపాట్లు తలెత్తకుండా చూసుకున్నారు. గురువారం ముగింపు కార్యక్రమానికి ముఖË్య అతిథిగా జడ్పీ ఛైర్మన్‌ కోరం కనకయ్య హాజరయ్యారు. ముందుగా క్రీడాకారులు, సొసైటీ అధికారులు, సిబ్బంది నిర్వహించిన కవాతును తిలకించారు. అనంతరం మాట్లాడుతూ.... స్నేహభావంతో ఉండేందుకు ఇలాంటి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. డీడీ రమాదేవి మాట్లాడుతూ... క్రీడలు సజావుగా సాగాయని, ఏడు సొసైటీల అధికారులు, కోచ్‌లు, పీడీ, పీఈటీలు, ఇతర సిబ్బంది సహకారం మరువలేదనిదన్నారు. ఏపీవో జనరల్‌ డేవిడ్‌రాజ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

క్రీడల అధికారికి సన్మానం:

జిల్లా గిరిజన క్రీడల అధికారి డా.ఎం.వీరునాయక్‌ను ఏడు సొసైటీల అధికారులు, పీడీ, పీఈటీ, కోచ్‌, రిఫరీలు సన్మానించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. గురువారం ఓ క్రీడాధికారి స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. సీవోఈపీడీ లక్ష్మణ్‌నాయక్‌, క్రీడల రాష్ట్ర అధికారులు సోమేశ్‌, రామ్‌లక్ష్మణ్‌, రవికుమార్‌, అరుణకుమారి, జ్యోతి, పార్థసారథి, డిప్యూటీ సెక్రటరీలు లతీఫ్‌, తిరుపతి, రామ్‌లాల్‌, జిల్లా గిరిజన క్రీడల అధికారి డా.ఎం.వీరునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

* అథ్లెటిక్స్‌, వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ, హ్యాండ్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, బాస్కెట్బాల్‌ తదితర 13 క్రీడల్లో పలువురు క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. గురువారం తుది పోరులో ఓవరాల్‌ ఛాంపియన్‌గా సోషల్‌ వెల్ఫేర్‌, ద్వితీయ స్థానంలో ట్రైబల్‌ వెల్ఫేర్‌(ఆశ్రమ), తృతీయ స్థానంలో మైనార్టీ గురుకులాలు నిలిచాయి.

* ఓవరాల్‌.. ఆల్‌ ఏజ్‌ గ్రూప్‌ గేమ్స్‌ ఛాంపియన్‌షిప్‌: సోషల్‌ వెల్ఫేర్‌ ప్రథమ, ట్రెబల్‌ వెల్ఫేర్‌(ఆశ్రమ) ద్వితీయ, మైనార్టీ, (బీసీ) గురుకులాలు (తృతీయ).

* ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ ఆల్‌ ఏజ్‌ గ్రూప్‌ స్పోర్ట్స్‌: సోషల్‌ వెల్ఫేర్‌, మైనార్టీ గురుకులం, ఆశ్రమ (ట్రెబల్‌ వెల్ఫేర్‌)

* ఓవరాల్‌.. ఆల్‌ ఏజ్‌ గ్రూప్‌ గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌: సోషల్‌ వెల్ఫేర్‌, ఆశ్రమ స్కూల్స్‌(ట్రెబల్‌ వెల్ఫేర్‌), మైనార్టీ మూడో స్థానంలో నిలిచాయి.

ద్వితీయ స్థానంలో ఆశ్రమ(ట్రెబల్‌ వెల్ఫేర్‌) జట్టు క్రీడాకారులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని