logo

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హిందూ ద్రోహి

సంపూర్ణ హిందువునని చెప్పుకొనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ హిందువుల ద్రోహి అని శ్రీకాకుళం ఆనందాశ్రమం పీఠాధిపతి, సాధు పరిషత్‌ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు. భద్రాచలం విచ్చేసిన ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు

Updated : 07 Dec 2022 05:18 IST

ఆనందాశ్రమం పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి

సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాసానంద సరస్వతి, చిత్రంలో కుంజా సత్యవతి

భద్రాచలం పట్టణం, న్యూస్‌టుడే: సంపూర్ణ హిందువునని చెప్పుకొనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ హిందువుల ద్రోహి అని శ్రీకాకుళం ఆనందాశ్రమం పీఠాధిపతి, సాధు పరిషత్‌ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు. భద్రాచలం విచ్చేసిన ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి హిందువై ఉండి.. హిందువులను కాలరాస్తా, నాశనం చేస్తా అంటున్న వారితో జత కట్టడమే ఆయన ద్రోహి అనడానికి నిదర్శనమన్నారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి రాముడికి రూ.100 కోట్లు ప్రకటించి విస్మరించారని ఎద్దేవా చేశారు. ఏపీలో ఉన్న దేవస్థానం భూములు కబ్జాకు గురవుతుంటే చేష్టలుడిగి చూడటం దారుణమన్నారు. తితిదే భూములు దేశంలో ఎక్కడ ఉన్నా వారు పరిరక్షించుకోవడం లేదా అని అన్నారు. యాదాద్రి చుట్టుపక్కల రియల్‌ ఎస్టేట్‌ దందాలో తనకు నచ్చిన వారి భూములున్నాయని అక్కడ ఆలయాన్ని అభివృద్ధి చేశారని ఆరోపించారు. త్వరలో అన్ని ధార్మిక సంస్థలతో భద్రాచలంలో పెద్ద ఎత్తున సభ నిర్వహించి భద్రాద్రికి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతామని హెచ్చరించారు. హిందువులంతా పార్టీలకు అతీతంగా భద్రాచలానికి న్యాయం జరిగేలా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. భాజపా నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, భాజపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు