వినియోగదారుల కేసులు లోక్ అదాలత్‌లో పరిష్కారం
ఫిబ్రవరి 11న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో వినియోగదారుల కోర్టుకు సంబంధించిన కేసులను కూడా పరిష్కరిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.శ్రీనివాసరావు అన్నారు.
వినియోగదారుల కమిషన్ సభ్యులకు సూచనలు ఇస్తున్న జిల్లా జడ్జి శ్రీనివాసరావు
ఖమ్మం న్యాయవిభాగం, న్యూస్‌టుడే: ఫిబ్రవరి 11న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో వినియోగదారుల కోర్టుకు సంబంధించిన కేసులను కూడా పరిష్కరిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.శ్రీనివాసరావు అన్నారు. న్యాయమూర్తి తన ఛాంబర్‌లో వినియోగదారుల కమిషన్ సభ్యులతో శుక్రవారం సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కమిషన్ తీర్పుల వల్ల కొన్ని సందర్భాల్లో కక్షిదారులు అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉందని, అదే లోక్ అదాలత్‌లో సమస్య పరిష్కారమైతే అంతిమ తీర్పుగా ఉంటుందన్నారు. వీలైనన్ని కేసులను పరిష్కరించేందుకు కృషి చేయాలని సభ్యులకు సూచించారు. న్యాయసేవాసంస్థ న్యాయమూర్తి ఎంఏ.జావీద్‌పాషా, వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు వడ్లమన్నాటి లలిత, సభ్యురాలు అద్దెపల్లి మాధవీలత తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Crime News
కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని
-
Ap-top-news News
ఎమ్మెల్యే అనిల్ ఫ్లెక్సీకి పోలీసుల పహారా