logo

నేడు పోడు పట్టాల పంపిణీ సర్వం సిద్ధం

జిల్లాలో పోడు పట్టాల పంపిణీ ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కానుందని, ఇందుకోసం సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ అనుదీప్‌ పేర్కొన్నారు.

Published : 30 Jun 2023 05:54 IST

అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌ అనుదీప్‌

పాల్వంచ కేటీపీఎస్‌, న్యూస్‌టుడే: జిల్లాలో పోడు పట్టాల పంపిణీ ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కానుందని, ఇందుకోసం సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ అనుదీప్‌ పేర్కొన్నారు. పాల్వంచలోని సుగుణ గార్డెన్‌ ఫంక్షన్‌ హాలులో ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి 500 మంది చొప్పన జిల్లా వ్యాప్తంగా 2,500 మంది లబ్ధిదారులకు తొలిరోజు పట్టాలు అందజేయనున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 50,595 మందికి పట్టాలు ఇస్తామన్నారు. మండలాల వారీగా ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల వద్ద స్థానిక పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు. అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ స్వర్ణలత, ఐటీడీఏ ఏపీఓ డేవిడ్‌రాజ్‌, ఓఎస్‌డీ సాయిమనోహర్‌, డీఎస్పీ వెంకటేశ్‌, డీఆర్డీఓ మధుసూదన్‌రాజు, జడ్పీ సీఈఓ విద్యాలత, జడ్పీ డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ రమాకాంత్‌, డీసీఓ వెంకటేశ్వర్లు, మైనార్టీ సంక్షేమాధికారి సంజీవ్‌రావు, ఆర్‌అండ్‌బీ డీఈ నాగేశ్వరరావు, డీఆర్వో అశోక్‌చక్రవర్తి, ఏఓ గనియా, పాల్వంచ తహసీల్దార్‌ రంగాప్రసాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు