logo

సత్తుపల్లి తొలి మహిళా ఎమ్మెల్యే రాగమయి

సత్తుపల్లి నియోజకవర్గం తొలి మహిళా ఎమ్మెల్యేగా డాక్టర్‌ మట్టా రాగమయి నిలిచారు.

Updated : 04 Dec 2023 06:02 IST

సత్తుపల్లి, న్యూస్‌టుడే: సత్తుపల్లి నియోజకవర్గం తొలి మహిళా ఎమ్మెల్యేగా డాక్టర్‌ మట్టా రాగమయి నిలిచారు. ఉమ్మడి జిల్లాలోనూ ఏకైక మహిళా ఎమ్మెల్యే తానే కావడం మరో విశేషం. సత్తుపల్లి(వేంసూరు) నియోజకవర్గంలో 1952 నుంచి 2018 వరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా ఏనాడు మహిళలకు అవకాశం దక్కలేదు. తొలి ప్రయత్నంలోనే హాట్రిక్‌ ఎమ్మెల్యే, భారాస అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యపై భారీ మెజార్టీతో గెలిచారు. వైద్యురాలిగా సత్తుపల్లి ప్రజలకు ఆమె సుపరిచితులు కావడంతోపాటు తన భర్త డాక్టర్‌ దయానంద్‌ కౌన్సిలర్‌గా, అత్త మట్టా ఆరోగ్యం ఎంపీపీగా పని చేయడంతో రాజకీయంగా ఆమెకు కలిసొచ్చింది. వైద్య రంగంలో ఉంటూనే దయానంద్‌ చేసే సేవా కార్యక్రమాల్లో ఆమె పాలు పంచుకోవడం, ప్రజల్లోనూ సానుభూతి, జనం కూడా మార్పు కోరడం వంటి అంశాలతోపాటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరిల అండదండలు కూడా అమె విజయానికి సోపానాలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని