logo

బాలుర వసతి గృహంలో చికిత్స కేంద్రం

స్థానిక బీసీ సంక్షేమ బాలుర వసతి గృహాన్ని కొవిడ్‌ కేర్‌ కేంద్రంగా మార్చారు. వసతి గృహంలో విద్యార్థులు చేరకపోవడంతో జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయి కొవిడ్‌ కేంద్రంగా మార్చి 40 పడకలను అందుబాటులో ఉంచినట్లు కేంద్రం నోడల్‌ అధికారి

Published : 23 Jan 2022 03:11 IST

సిద్ధం చేసిన పడకలు

కైకలూరు: స్థానిక బీసీ సంక్షేమ బాలుర వసతి గృహాన్ని కొవిడ్‌ కేర్‌ కేంద్రంగా మార్చారు. వసతి గృహంలో విద్యార్థులు చేరకపోవడంతో జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయి కొవిడ్‌ కేంద్రంగా మార్చి 40 పడకలను అందుబాటులో ఉంచినట్లు కేంద్రం నోడల్‌ అధికారి డి.విజయ్‌బాబు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా బారిన పడి ఇంటి వద్ద చికిత్స తీసుకునేందుకు ఇబ్బందులు ఉన్నవారు ఇక్కడ చేరవచ్చని తెలిపారు. ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది పర్యవేక్షణలో చికిత్స అందించి మందులు, ఆహారం ఉచితంగా అందిస్తామన్నారు. కరోనా నిర్ధారణ నివేదికను వెంట తెచ్చుకోవాలన్నారు. ప్రస్తుతం సీతనపల్లి, కొల్లేటికోట, మండవల్లి వైద్యులు, వైద్య సిబ్బంది మూడు విడుతలుగా విధులు నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని