Andhra News: చేపల ధర తగ్గించమంటే కత్తితో విచక్షణా రహితంగా దాడి

చేపల ధరను తగ్గించమని అడిగినందుకు ఇద్దరిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటుచేసుకుంది.

Updated : 20 May 2022 13:56 IST

గుడివాడ: చేపల ధరను తగ్గించమని అడిగినందుకు ఇద్దరిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటుచేసుకుంది. బంటుమిల్లి రోడ్డులోని చేపల దుకాణంలో మహమ్మద్‌ రబ్బానీ అనే వ్యక్తి చేపలు కొనుగోలు చేశాడు. కొన్న చేపల్లో అరకిలోకి పైగా జన రావడంతో ధర తగ్గించమని రబ్బానీ అడిగాడు. దీంతో దుకాణ యజమాని శివ, రబ్బానీ మధ్య వాగ్వాదం జరిగింది. 

ఈ క్రమంలో రబ్బానీపై శివ దాడి చేశాడు. విషయం తెలుసుకున్న రబ్బానీ కుటుంబసభ్యులు రఫీ, రసూల్‌ అక్కడికి చేరుకుని ఇదేం పద్ధతని ప్రశ్నించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన శివ.. తన కుమారుడితో కలిసి రఫీ, రసూల్‌పై కత్తితో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. దాడిలో రసూల్‌ మెడ, రఫీ చేతులకు గాయాలయ్యాయి. వీరిని తొలుత గుడివాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. పోలీసులు బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుని కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని