logo

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

గణిత పరీక్షలో మార్కులు తక్కువ వస్తాయనే మానసికాందోళనతో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాడిగడప మున్సిపాలిటీలో చోటుచేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం.. మున్సిపాలిటీలో నివాసముంటున్న ఆయన పెద్ద కుమార్తె(17)

Published : 26 May 2022 06:18 IST

పెనమలూరు, న్యూస్‌టుడే: గణిత పరీక్షలో మార్కులు తక్కువ వస్తాయనే మానసికాందోళనతో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాడిగడప మున్సిపాలిటీలో చోటుచేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం.. మున్సిపాలిటీలో నివాసముంటున్న ఆయన పెద్ద కుమార్తె(17) ఇంటర్‌ మొదటి ఏడాది చదువుతోంది. గణిత పరీక్షలో మార్కులు తక్కువ వస్తాయనే ఆందోళనతో మంగళవారం ఉదయం నుంచి మానసిక ఒత్తిడికి గురవుతుండటాన్ని తల్లిదండ్రులు గుర్తించి ధైర్యం చెప్పారు. మంగళవారం సాయంత్రం తల్లిదండ్రులు బయటకు వెళ్లగా సోదరీసోదరులు ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. రాత్రి తల్లి పని నుంచి ఇంటికి చేరుకొని తలుపులు తట్టినా తెరవకపోవడంతో కిటికీలోంచి చూడగా విద్యార్థిని చున్నీతో పైఫ్యానుకు ఉరిపెట్టుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే స్థానికుల సాయంతో తలుపులు పగులకొట్టి కిందకు దించి చూడగా అప్పటికే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. తండ్రి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేయడానికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని