logo

ఆలోచించారు.. ఆవిష్కరించారు

కర్నూలు నగర శివారులోని డా.కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో పవన్‌ కల్యాణ్‌, నూర్‌ మహమ్మద్‌, మహేంద్రరెడ్డి, లోకేష్‌ చౌదరి, నరేంద్రలు బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు. బీటెక్‌ ఆఖరి సంవత్సరం కావడంతో ప్రాజెక్ట్‌ వర్క్‌ చేయాల్సి వచ్చింది. కరోనా కారణంగా

Published : 08 Aug 2022 03:31 IST

 ప్రతిభ చాటుతున్న ఇంజినీరింగ్‌ విద్యార్థులు

విద్యార్థులు ఆవిష్కరించిన పరికరం

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : కర్నూలు నగర శివారులోని డా.కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో పవన్‌ కల్యాణ్‌, నూర్‌ మహమ్మద్‌, మహేంద్రరెడ్డి, లోకేష్‌ చౌదరి, నరేంద్రలు బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు. బీటెక్‌ ఆఖరి సంవత్సరం కావడంతో ప్రాజెక్ట్‌ వర్క్‌ చేయాల్సి వచ్చింది. కరోనా కారణంగా విద్యార్థులకు సైతం ఇబ్బందులు తప్పలేదు. ప్రాజెక్టు వర్క్‌ పూర్తి చేసి పరికరాన్ని ప్రదర్శించేందుకు సమయం తక్కువగా ఉంది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. అలా అందరూ బాగా ఆలోచించి ఓ పరికరాన్ని తయారు చేయాలని సంకల్పించారు. ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన. అందరికి ఉపయోగపడేలా ఏదైనా చేస్తే బాగుంటుందని ఫ్యాబ్రికేషన్‌ ఆఫ్‌ సోలార్‌ ప్యానెల్‌ డస్ట్‌ క్లీనింగ్‌ మిషన్‌ను తయారు చేశారు. విద్యుత్తు ఆదా చేసేందుకు ప్రస్తుత రోజుల్లో చాలా మంది సోలార్‌ బోర్డులు, పరికరాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీటిపై దుమ్ము పడితే వేడి గ్రహించుకునే శక్తి తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఆటోమెటిక్‌గా దుమ్మును దులిపే యంత్రాన్ని రూపొందించారు. పలువురి చేత శెభాష్‌ అనిపించుకున్నారు.
  తయారీ విధానం.. పనితీరు
పరికరాన్ని తయారుచేసేందుకు నెల రోజులు పట్టిందని, సుమారు రూ.20 వేల వరకు ఖర్చైందని పవన్‌కల్యాణ్‌ అనే విద్యార్థి తెలిపారు. (టీంలో సభ్యుడు.. మిత్రుల్లో ఒకరు) సోలార్‌ ప్యానెల్‌, రోలర్‌, చైన్‌ స్పార్కెట్లు, ఐరన్‌ స్టాండ్‌ వినియోగించారు. సోలార్‌ బోర్డులపై పడే దుమ్మును ఆటోమేటిక్‌గా ఈ పరికరం శుభ్రం చేస్తుంది. దీంతో సౌరశక్తిని సోలార్‌ బోర్డులు గ్రహించి విద్యుత్తు సరఫరా చేసేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.

పనితీరును వివరిస్తూ..

రైతు కోసం విత్తనం నాటే యంత్రం
ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే : సాంకేతిక రంగంలో చదివిన విద్యార్థులు భిన్న ఆలోచనలు చేసి ఆదుర్స్‌ అనిపించారు. రైతులు సులభంగా విత్తనం విత్తే పద్ధతిని ఆవిష్కరించారు. ఎమ్మిగనూరు పరిధిలోని ఎర్రకోట ఇంజనీరింగ్‌ విద్యార్థులు రాజ్‌కుమార్‌, మహేష్‌, జగదీష్, చంద్రశేఖర్, బాషా(లెక్చరర్‌), రవి శంకర్‌(హెచ్ఓడి), సునీల్‌కుమార్‌ బృంద సభ్యులు రైతుల కష్టాలు తెలుసుకున్నారు.  సులభంగా విత్తనం విత్తేలా యంత్రం తయారు చేశారు. వీల్స్‌ ద్వారా పొలంలో నాటేందుకు ఉపయోగపడుతోంది. ఎకరా పొలంలో సాగుచేసే అవకాశం ఉంది. కాడ్డెదులు, మనుషులతో పనిలేకుండా ఒక్కరే విత్తేందుకు ఇది ఉపయోగపడుతోంది. వీల్స్‌, సెన్సార్‌, ఫ్రేమం బోర్డు, డివైడింగ్ యంత్రం, విత్తనం వేసేందుకు పెద్ద బౌల్‌, మైక్రోకంట్రోలర్‌ 500, డీజీ మోటర్‌, పవర్‌ మోటర్‌,  ఎల్‌సీడీ బోర్డులను అమర్చుతారు. వీటికి రూ.10 వేలు ఖర్చవుతోంది. సొంత పొలంలో విత్తనం వేసేందుకు అనుకూలంగా ఉంటుంది. వాటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిత్యం ప్రయత్నిస్తున్నట్లు విద్యార్థులు వివరించారు.

సూపర్‌.. సోలార్‌ కార్‌
కర్నూలు విద్యావిభాగం, న్యూస్‌టుడే : కాలుష్య నియంత్రణలో భాగంగా విద్యుత్తు వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనాలు, కార్లు అందుబాటులోకి వచ్చాయి. తామూ అలాంటి వాహనాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నారు.. నగర శివారులోని జి.పుల్లయ్య ఇంజినీరింగ్‌ మూడో ఏడాది చదువుతున్న శ్రీనివాసరావు, ఇనాయతుల్లా, హరికృష్ణ, అశోక్‌లు. ఈ నలుగురు మిత్రులు కలిసి సోలార్‌ సిస్టమ్‌తో నడిచేలా సోలార్‌ కారును తీర్చిదిద్దారు. ఇందులో వైఫై, బ్లూటూత్‌ ప్రత్యేకం. వాహనం ఎక్కడ ఉందో తెలిపేలా ఆడియో రూపంలో వివరిస్తుంది. 6 గంటలపాటు ఛార్జింగ్‌ చేస్తే 25 నుంచి 30 కిలోమీటర్ల వరకు తిరగొచ్చు. సోలార్‌ కారు తయారీకి సుమారు రూ.1.60 లక్షలు ఖర్చైనట్లు విద్యార్థులు తెలిపారు.
ప్రమాదాలు నివారించేలా..

కొత్త ఆలోచనలతో నవ సమాజ నిర్మాణానికి అవసరమైన ఆవిష్కరణలు చేయాలని సంకల్పంతో మెదడుకు పదును పెట్టి సరికొత్త ప్రయోగాలు చేశారు. హర్ష, సామ, జగదీష్, రవిశంకర్‌, జావేద్ బ్బాషా, విజయకుమార్‌, అరుణ్‌, వంశీ ఇంజినీరింగ్‌ చదువుతున్నారు. వాహనాల్లో వేగంగా వెళ్తూ ప్రమాదాల బారిన పడడం వీరు గమనించారు. దీంతో ఇంటెలిజెంట్‌ బ్రేకింగ్ పద్ధతితో ప్రమాదాలు జరగకుండా చేయాలని ప్రయోగాలు చేసి నూతనమైన యంత్రం ఆవిష్కరించారు. అతివేగంగా వెళ్లే సమయంలో వాహనాలకు ఏదీ అడ్డు వచ్చినా ప్రయోగం ద్వారా అమర్చుకున్న యంత్రంతో నివారించవచ్చు. అల్ట్రా సోని సెన్సార్‌ బోర్డు, రిసీవర్‌, మీటర్‌, కంప్యూటర్‌ పరిధిలో బోర్డు, సిగ్నల్స్‌ రిసీవర్‌, ఫెమీనా మీటర్‌, బాడీ ఫ్రేమ్‌, వీల్స్‌ పరికరాలు అమర్చుకోవాలి. వాటిని కనుగోనేందుకు రెండు నెలల సమయం పట్టింది. దీనికి రూ.11వేలు ఖర్చు అవుతోంది. అల్ట్రాసోనిక్‌ సెన్సార్‌ బోర్డు, రిసీవô్ను వాహనానికి అమర్చుకోవాలి. అడ్డంగా వస్తే ఇది సిగ్నల్స్‌ పంపడంతో డ్రైవô్తో సంబంధం లేకుండా వాహనాలు నిలిపే అవకాశం ఉంటుంది. మిత్రులు కలిసి మూడు నెలలపాటు గదిలో ఉండి వాటిని కనుగొన్నట్లు విద్యార్థులు హర్ష, సామ తెలిపారు.
 

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts