logo

జులై 15 కాదు.. ఆగస్టు 15 వస్తోంది

రాష్ట్రంలో జులై 15వ తేదీలోగా రహదారులపై ఒక్క గుంత లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. ఆగస్టు 15 వస్తున్నా ఒక్కటీ  పూడ్చలేదని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ప్రస్తుతం రహదారుల పరిస్థితిని

Published : 13 Aug 2022 00:39 IST

రోడ్లపై గుంతలు పూడ్చలేదు

సోమిశెట్టి వెంకటేశ్వర్లు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో జులై 15వ తేదీలోగా రహదారులపై ఒక్క గుంత లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. ఆగస్టు 15 వస్తున్నా ఒక్కటీ  పూడ్చలేదని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ప్రస్తుతం రహదారుల పరిస్థితిని చూస్తే సీఎం మాటలకు.. చేతలకు పొంతన లేకుండా ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తల్లి వైఎస్‌ విజయమ్మ కారు టైర్లు పేలిన ప్రాంతాన్ని శుక్రవారం సోమిశెట్టితోపాటు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ తదితరులు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిధుల కొరత కారణంగా రోడ్లకు మరమ్మతులు చేసే పరిస్థితి లేకుండా పోయింది... రాష్ట్రంలో ఏ ఒక్క రహదారికి పడిన గుంతలో కనీసం మట్టి వేసి పూడ్చిన పాపాన పోలేదన్నారు. కర్నూలు-సుంకేసుల రోడ్డును సందర్శించి వీడియోల ద్వారా వాస్తవాలు తెలిపాం.. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. వైఎస్‌ విజయమ్మ కారు ప్రమాద విషయం ప్రతిపక్ష పార్టీల వారికి తెలిస్తే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందేమోనని.. ఇలా టైర్లు పంక్చరైనట్లు చెబుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు ఎస్‌.అబ్బాస్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధికార ప్రతినిధి బజారన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని