logo

ఖాళీలు ఎక్కువ.. భర్తీ తక్కువ

పోలీసు శాఖలో నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

Published : 29 Nov 2022 02:19 IST

కానిస్టేబుళ్ల నియామకానికి ప్రకటన
ఉమ్మడి జిల్లాలో 285 పోస్టుల భర్తీ

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : పోలీసు శాఖలో నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 315 ఎస్సై, 96 ఆర్‌ఎస్సై, 3,580 కానిస్టేబుల్‌ పోస్టులు, 2,520 ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జీవో జారీ చేసింది. ఇందులో ఉమ్మడి జిల్లాలో కానిస్టేబుల్‌ పోస్టులు 285 వరకు ఉన్నాయి.  రాయలసీమ జోన్‌కు ఎంతమంది ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు అన్న వివరాలు పొందుపరచలేదు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో జరగనుంది. కానిస్టేబుల్‌ దరఖాస్తుల స్వీకరణ ఈనెల 30న మొదలై డిసెంబర్‌ 28న ముగియనుంది. వచ్చే జనవరి 22న ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్సై, ఆర్‌ఎస్సై నియామకాలకు సంబంధించి డిసెంబర్‌ 14 నుంచి 2023 జనవరి 18న వరకు దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ జరగనుంది.

* ఏపీఎస్పీ రెండో పటాలంలో 302 కానిస్టేబుల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా వెలువడిన ప్రకటనలో ఏపీఎస్పీ రెండో పటాలం కానిస్టేబుల్‌ నియామకాల ప్రస్తావన లేకపోవటం గమనార్హం.

* ఉమ్మడి జిల్లా పోలీసు శాఖలో సివిల్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు దాదాపు 560 వరకు ఖాళీలు ఉండగా ప్రస్తుతం 285 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని