logo

రైతులకు తక్షణమే పరిహారం అందించాలి

పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తెలుగు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఆదిశేషారెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 29 Nov 2022 02:19 IST

కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న తెలుగు రైతు సంఘం నాయకులు

కర్నూలు (బి.క్యాంపు), న్యూస్‌టుడే: పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తెలుగు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఆదిశేషారెడ్డి డిమాండ్‌ చేశారు. నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ తెదేపా కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు చేపట్టిన ర్యాలీని సోమిశెట్టి జెండా ఊపి ప్రారంభించారు. ఆదిశేషారెడ్డి మాట్లాడుతూ ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు, కర్నూలు తదితర నియోజకవర్గాల పరిధిలో రైతులు ఈ ఏడాది పెద్దఎత్తున వివిధ పంటలు సాగు చేశారని చెప్పారు. అతివృష్టి, అనావృష్టితో భారీగా నష్టపోయారని, వారికి పరిహారం అందించాలని కోరారు. రైతుల వలసలు నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతు బాగుండాలంటే.. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా రైతు సంఘం కార్యదర్శి కాకర్ల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిన్నలక్ష్మణ, రైతులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు