logo

ప్రశాంతంగా కానిస్టేబుళ్ల రాత పరీక్ష

కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించి రాత పరీక్ష ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 48 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.

Published : 23 Jan 2023 04:38 IST

1,209 మంది గైర్హాజరు

డాక్టర్స్‌ కాలనీలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల వద్ద బారులుదీరిన అభ్యర్థులు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించి రాత పరీక్ష ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 48 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. చాలామంది ఉదయం 9 గంటలకల్లా చేరుకున్నారు. అభ్యర్థులను పోలీసులు నిశితంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. పరీక్ష ఉదయం 10 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. సిల్వర్‌జూబ్లీ  కళాశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను కర్నూలు రేంజ్‌ డీఐజీ సెంథిల్‌కుమార్‌ తనిఖీ చేశారు. సెయింట్‌ జోసెఫ్‌ కళాశాల, మాంటిస్సోరి పాఠశాల, సిల్వర్‌జూబ్లీ, కె.వి.సుబ్బారెడ్డి కళాశాల కేంద్రాలను ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. 22,630 మంది అభ్యర్థులకుగాను 21,421 మంది హాజరుకాగా 1,209 మంది గైర్హాజయ్యారు. అనంతరం భద్రత కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ పత్రాలను ఆదివారం సాయంత్రం కాకినాడ జేఎన్‌టీయూకి తరలించారు. పరీక్ష నిర్వహణలో రీజినల్‌ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరెడ్డి, అదనపు ఎస్పీ ప్రసాద్‌, డీఎస్పీలు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


సిల్వర్‌జూబ్లీ కళాశాలలో డీఐజీ సెంథిల్‌కుమార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని