logo

సిద్దాపురం ఎత్తిపోతల ద్వార ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తాం

తెదేపా అధికారంలోకి రాగానే సిద్దాపురం ఎత్తిపోతల కాలువలు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తామని నంద్యాల పార్లమెంట్ తెదేపా బాధ్యుడు మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య అన్నారు.

Published : 26 Apr 2024 21:42 IST

పాములపాడు: తెదేపా అధికారంలోకి రాగానే సిద్దాపురం ఎత్తిపోతల కాలువలు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తామని నంద్యాల పార్లమెంట్ తెదేపా బాధ్యుడు మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య అన్నారు. శుక్రవారం మండలంలోని భానుముక్కల గ్రామంలో శాంఖరావం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం సిద్దాపురం ఎత్తిపోతల కాలువలు పూర్తి చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపొయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం తెదేపా పరిశీలకుడు శ్రీనాధ్ రెడ్డి, మండల కన్వీనర్ రవీంద్రనాథ్రెడ్డి, నాయకులు వెంకటేశ్వరరావు గోవింద హరినాధ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని