లోకేష్ పాదయాత్రతో వైకాపా నేతల్లో గుబులు
రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు తెదేపా యువ నాయకుడు నారా లోకేశ్ పాదయాత్ర చేపట్టడంతో వైకాపా నాయకుల గుండెల్లో గుబులు మొదలైందని మాజీ కేంద్ర మంత్రి, తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు.
ముగతిలో పర్యటిస్తున్న మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
ఎమ్మిగనూరు , న్యూస్‌టుడే: రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు తెదేపా యువ నాయకుడు నారా లోకేశ్ పాదయాత్ర చేపట్టడంతో వైకాపా నాయకుల గుండెల్లో గుబులు మొదలైందని మాజీ కేంద్ర మంత్రి, తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. నందవరం మండలం ముగతి గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. నాలుగేళ్లలో పల్లెల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. తెదేపా హయాంలో రూ.64 వేల కోట్లతో 23 ప్రాజెక్టులు పూర్తిచేసి ఏడు లక్షల ఎకరాల నూతన ఆయకట్టుకు సాగునీరు ఇస్తే.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదన్నారు. గుండ్రేవుల, ఎల్లెల్సీ, వేదవతి, ఆర్డీఎస్ కుడి కాల్వ పనులకు తెదేపా హయాంలోనే నిధులు కేటాయించారన్నారు. పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక సీఎం జగన్ జీవో నెంబర్ 1 అమలు చేసి రాష్ట్రంలో బ్రిటీష్ పాలన గుర్తు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్‌శెట్టి, వీరారెడ్డి, ఆదెన్న, అల్తాఫ్, కురుమన్న, ఈరయ్య, దస్తగిరి, ఉరుకుందు, హనుమంతు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
KTR: సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలి: పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం
-
Movies News
Balagam: ‘బలగం’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న గ్రామస్థులు
-
India News
Uttarakhand: లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి, 20మందికి గాయాలు..!
-
India News
Anurag Thakur: ‘రాహుల్ గాంధీ పది జన్మలెత్తినా.. సావర్కర్ కాలేరు’
-
Movies News
Rana: రానా.. చిన్నప్పటి ఇంటిని చూశారా..!
-
Sports News
Virender Sehwag: అప్పుడు వాళ్లను వీర బాదుడు బాదుతాను అన్నాను.. కానీ : సెహ్వాగ్