logo

ఉత్సాహంగా జిల్లా జట్ల ఎంపిక పోటీలు

త్వరలో జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్పు పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక పోటీలు శనివారం నగరంలోని డీఎస్‌ఏ స్టేడియంలో జరిగాయి.

Published : 29 Jan 2023 04:25 IST

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న క్రీడాప్రాధికార సంస్థ సీఈవో రమణ

కర్నూలు క్రీడలు (బి.క్యాంపు), న్యూస్‌టుడే: త్వరలో జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్పు పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక పోటీలు శనివారం నగరంలోని డీఎస్‌ఏ స్టేడియంలో జరిగాయి. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సీఈవో రమణ క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఖోఖో పురుషుల విభాగంలో తుగ్గలి మొదటి, నందికొట్కూరు రెండో స్థానంలో నిలిచాయి. వాలీబాల్‌లో కోడుమూరు, కర్నూలు, పత్తికొండ వరుస స్థానాలు సాధించాయి. ఫుట్‌బాల్‌ పురుషుల విభాగంలో నంద్యాల ప్రథమ, కర్నూలు ద్వితీయ, నంద్యాల తృతీయ స్థానాలు సాధించాయి. మహిళా విభాగంలో ఖోఖోలో తుగ్గలి జట్టు విజేతగా నిలిచింది. వాలీబాల్‌లో కర్నూలు, పత్తికొండ, కోడుమూరు వరుస స్థానాల్లో నిలిచాయి. ఫుట్‌బాల్‌లో నంద్యాల మొదటి, కర్నూలు రెండో స్థానాన్ని సాధించాయి. ఆయా జట్లకు డీఎస్‌ఏ అధికారులు బహుమతులు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని